3 March (03.03.) (63)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

ఉదయం సాయం సంధ్య వేళలలో కొలది నిమిషాలు ఏ ఆలోచన లేకుండా ఉండాలి. ఏకాగ్రతగా ధ్యానం చేయాలి. సాధనను నెమ్మదిగా మొదలు పెట్టుకుంటే ప్రేమ, కరుణతత్వపు పరిపూర్ణమైన అవగాహన కలుగుతుంది.

During Morning and Evening twilight times, spend few minutes without any thought. Concentrately meditate. If you start practicing slowly, you will have a fuller understanding of love and compassion. (3 Mar)
 



63) ప్రభో సాయి రామ రావా.....మమ్మేలు కోరా
ప్రభో సాయి రామ రావా..... 
మమ్మేలు కోరా షిరిడి నివాసా శ్రీనివాసా ॥ప్రభు॥ 
 
తల్లివి నీవే తండ్రివి నీవే గురువు దైవము 
నీవే రాముడు నీవే కృష్ణుడు 
నీవే దత్తమారుతి నీవే శివ నాగ సాయి 
నీవే శ్యామ సాయి నీవే జయహో సాయిశా.... 
జయహో సాయిశా .....॥ప్రభొ॥ 
 
నీవే దిక్కని నిరతము నమ్మి కొలిచే వారము 
దేవా కరుణను చూపి కడదేరిడి 
మార్గములను చూపగా రావా రంగనాథ సాయి 
నీవే రామదాస నీవే జయహో 
సాయిశా.... జయహో సాయిశా.... ॥ప్రభో॥ 
 
సుఖదుఃఖములకు చెదరని మనసును 
కరుణనొసంగుము స్వామి 
సద్భక్తులమై నీ పద సన్నిధి చేరగ చేయుము స్వామి 
మము దయ గనవే సాయి ద్వారకామాయి 
ఈశ మహేశా సాయి నటేశా శామసన్నుతా॥ ప్రభు॥

Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)