19 March (19.03.) (79)
శ్రీ శారదా శ్యామ సందేశం:
విజయం పొందడానికి నీవు స్థిరమైన పట్టుదలను, బలమైన సంకల్పాన్ని కలిగి ఉండాలి. అలాంటి శక్తిని పొంది, కష్టపడితే నీవు గమ్యం చేరగలుగుతావు.
To
succeed you must have consistent perseverance and strong willpower. Get
that energy and work hard, you will reach there. (19 Mar)
79) ఏమి కర్మముల చేసితినో నేనేమీ పాపముల నొనరించితినో
ఏమి కర్మముల చేసితినో
నేనేమీ పాపముల నొనరించితినో
ఈ భూమిలో పలు బాధల వలలో
జిక్కి దిక్కుతోచక ఉన్నాడను ॥ఏమి॥
నిను నమ్మితిని, ఓర్పుగ
నుంటిని నీవేదో మేలొన గూర్తువని
ఎన్నడు నీ దయ ప్రసరించునోయని
ఎదురు తెన్నులు జూచుచు నుంటిని ॥ఏమి కర్మముల॥
నీ దయ రాక దారి తెలియక
నిట్టూర్పులతో బ్రతుకుచు నుంటిని
అంతము లేదా ఈ ఓర్పునకు,
అభయము నీయవా ఈ ఆర్తునకు ॥ ఏమి కర్మముల॥
ఎటు నిను వేడిన కరుణించెదవో
ఎటు ప్రార్ధించిన మొరలాలిన్తువో
ఎరుగని వాడను సాయి దేవా,
ఎటు నను బ్రోతువో దేవా దేవా ॥ ఏమి కర్మముల॥
తండ్రివి నీవే దయమాలిన
ఇక దీనజనులకు దిక్కెవరయ్యా
మా మొరలను విని వేదనలను
గని సరగును బ్రోవుము శామసన్నుత॥ ఏమి కర్మముల॥
Comments
Post a Comment