14 March (14.03.) (74)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

పురాకృతసుకృతంవల్లను, దైవానుగ్రహంవల్లను ఉత్తమమగు గురువు సాంగత్యం లభిస్తుంది. అలాంటి గురువును అనుసరించడం పుణ్యాత్ములైన శిష్యుల కర్తవ్యం.

Due to antique great works and Divine blessings, You will get the best companionship of the Guru. It is the duty for virtuous disciples to follow such a Guru. (14 Mar)
 


74) శ్రీకరా ! శ్రీ షిరిడీశ్వరా
శ్రీకరా ! శ్రీ షిరిడీశ్వరా
ప్రేమగ నను గావరా ! సాయిశ్వరా! ॥శ్రీకర ॥

గురుడవు నీవని, దైవము నీవని,
గురువే దైవమని, సత్య ధర్మము
సత్పథ మర్మము తెలుపగా వేడితిమి

నీ నామామృత పానము చేయుచూ
నీవే శరణమని పిలిచి పిలిచి
నేను గొలిచి గొలిచి నేనలసిపోతిని రా
దయను చూపి నీ దర్శనము నొసగి
హృదయ మందిరము నందు నిలువరా! పలుకరించరా ! ॥ శ్రీకర॥

నిష్ట సబూరుల శిక్షణ నొసగగ
ఇక్కట్టుల కలిగించితివో !
సుఖదుఃఖంబులలో సమభావము
కలుగునటుల కరుణించితివా
మోహము నెప్పుడు కూల్చెదవో
మోదమునెప్పుడూ కూర్చెదవో
ఎటుల నీ దరికి చేర్చెదవో
ఎప్పుడు నీలోన నిలుపెదవో
నేనెరుగలేను రా శ్యామ సన్నుత సాయి ॥ శ్రీకర॥


Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)