10 March (10.03.) (70)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

మనము మనశ్శాంతిగా ఉండాలి అంటే ఎదుటివారి తప్పులు, చెడు, లోపాలు చూడకుండా ఉండాలి
If we want to have peace of mind, we should not see the mistakes, badness and defects of others. (10 Mar)
 

70) సాయి నన్ను బ్రోవ భారమా
సాయి నన్ను బ్రోవ భారమా
రామ సాయి నన్ను బ్రోవ భారమా
శివ సాయి నన్ను బ్రోవ భారమా
కృష్ణ సాయి నన్ను బ్రోవ భారమా
శ్యామ సాయి నన్ను బ్రోవ భారమా //సాయి//

మంచి చెడుగులను భేదము
మది నెంచక యుండుట నా నేరమా
సాయిరామ నన్ను బ్రోవ భారమా...

కామ క్రోధాదుల తోడను...
కలహించి జీవించుట నా నేరమా... ॥సాయి॥

దానధర్మంబుల జేయక
నీచ స్వార్థంబు నడతలు నా నేరమా... ॥సాయి ॥

ఈర్ష్య అసూయలతోడను
భక్తులందరినీ దూరట నేరమా...॥ సాయి॥

తప్పులన్నీ తెలిసి కృంగుచు
నీకు చెప్పుకొనుటయే నేరమా ...॥సాయి॥

మెప్పుదనముగా నే పొంగుచు
నా గొప్పదనము గోర నేరమా...॥ సాయి॥

చేయరాని పనులు చేసితి,
మరి వినగరాని మాటలాడితి నని ..॥సాయి ॥

శ్యామచరణుని నన్ను దూరము చేయకుమని
వేడుకొందును నిన్ను దైవమా ..॥సాయి॥

Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)