29 March (29.03.) (89)
శ్రీ శారదా శ్యామ సందేశం:
యాద్భావం తద్భవతి
సద్భావం సద్భవతి
దుర్భావం దుర్భవతి
నభావం నభవతి.
What we think, that will happen
Good Thoughts, Good Results
Bad thoughts, Bad Results
No thoughts, No results (29 Mar)
89) కన్న తండ్రీ కావగా
కన్న తండ్రీ కావగా
కరుణ మానితి వేలరా
కనులు గానక కళ్ళలాడుచు
కష్టములలో నుంటిరా॥కన్నతండ్రీ॥
విశ్వమందున అణువు
నేనను సత్యమును గుర్తించనైతిని
విర్ర వీగుచు నేను నేనని
నాది నాదని తలచు చుంటిని ॥కన్నతండ్రి॥
నిన్ను జేరగ దలచి నంతట నన్ను లాగును
మోహము నిన్ను తలవగ నెంచి నంతట
మనసు చేయును మోసము దారి తెలియక
నిన్ను జేరిన శ్యామ కీవే శరణము ॥కన్నతండ్రి॥
Comments
Post a Comment