26 March (26.03.) (86)
శ్రీ శారదా శ్యామ సందేశం:
చపాతీ పిండి లాగా, నలిగి అగ్నికి కాల్చబడితే కానీ చపాతీ కాదు. అలాగే మనము కూడా బాగా నలిగితే కానీ సాధనలో పైకి రాలేము.
Like
wheat flour, Crushed and fire baked flour become Chapati. Like If we
are also crushed well then can get up in practice. (26 Mar)
86) కలుగదా నామీద జాలి
కలుగదా నామీద జాలి సాయి కరుగదా
నీ మనసు నా ప్రార్థనలను విని ॥కలుగదా॥
తనువశాశ్వతము ఆశయే దుఃఖము
రుణాను బంధమే ఈ బంధములని
జూచుచు నుండి మనసు నిలపక లేక
సుడి గుండములో జిక్కినవాడను॥ కలుగదా॥
తనువు మనసులకు బలమే లేదు
మమకారంబుల కంతమే లేదు
సద్గతి నందెడి మార్గము తెలియక
అజ్ఞానంతో బ్రదుకుచు నుండగా ॥ కలుగదా॥
సద్గతిని గోరిన సుఖములు తొలగును
సుఖముల గోరిన సగ్గతి కలుగదు
రెంటిని గోరుచు నుంటిని ఈ భువి
కంటికి రెప్పగ కాపాడెదవని ॥ కలుగదా॥
Comments
Post a Comment