4 March (04.03.) (64)
శ్రీ శారదా శ్యామ సందేశం:
మానవులు మాటలకు లొంగుతారు, భగవంతుడు భక్తికి లొంగుతారు, మహాత్ములు మనసులోని సత్భావనలకు లొంగుతారు. భావం పటిష్టంగా ఉండాలి చలించ కూడదు. తల్లిదండ్రుల పై భావం ఎప్పటికీ ఒకేలా ఉంటుందో ఆ విధంగా ఉండాలి.
Humans will surrender to words, God will surrender to devotion, great people will surrender to the true'feelings in the heart. The feeling should be firm and consistent. Like our feelings on parents, like that our feelings should be there. (4 Mar)
64) ఇది ఏమి ఆటరా తండ్రీ ! ఇది ఏమి వేడుక దేవా!
ఇది ఏమి ఆటరా తండ్రీ !
ఇది ఏమి వేడుక దేవా!
ఇటు నటు నూపుచు
ఇటు నటు నూపుచు
అటు నిటు జేర్చక ఆడించుచున్నావు సాయి.... ॥ఇది ॥
భక్తితోడ నిన్ను తలచ దలంచిన
భక్తితోడ నిన్ను తలచ దలంచిన
భవ బంధములు బంధములాయెను
నీదు లీలలను గానము జేయగా నెంచిన
నా మది నిలువక పోయెను లోకవాసనల
వ్యామోహములతో మంచి చెడుగుల
విచక్షణ లేక గుడ్డివానిగా బతుకుచు నుంటిని
పిచ్చివానిగా వాగుచు నుంటిని ॥ఇది॥
పరబ్రహ్మమే నీ వనెడి నిజము పరిపూర్ణముగా
తెలియగ నైతిని బాధ్యతలను భరియంచెడి
నిన్ను భక్తిగ నెపుడు గొలువ నైతిని సర్వము
నీదని అనుకొనుచు నాది యనుచునే భ్రమ పడుచుంటిని
జ్ఞానము నొసగక శ్యామను ఈ భువి అవివేకముతో బ్రతుకగ జేయగా ॥ఇది॥
Comments
Post a Comment