1 March (01.03.) (61)
శ్రీ శారదా శ్యామ సందేశం:
ఏ పని చేస్తున్నా, ఏ ఆలోచనలో సర్వాంతర్యామి ఉన్నా ఆ సద్గురువు మనలను తదేకంగా గమనిస్తున్నారు అనే భావన ఉండాలి. ఆయన ప్రతిరూపం మనసులో చూసుకోవాలి. ఆయనతో చెప్పుకోవాలి. ఆయన సమాధానం చెప్పినట్టు భావించుకోవాలి.
Whatever we are doing, Whatever omnipresent is thinking, We must have the feeling that the Guru is watching over us. His replica must be kept in mind. Have to say to him. Assume he answered. (1 Mar)
61) భగవన్నామమే తరుణోపాయము
భగవన్నామమే తరుణోపాయము
బంధములూడుటకు అది ఉపాయము॥ భగవన్నామమే॥
సాయిరాం సాయిరాం సాయిరాం
బంధములూడుటకు అది ఉపాయము॥ భగవన్నామమే॥
సాయిరాం సాయిరాం సాయిరాం
సాయి శ్యామ్ సాయి శ్యామ్
సాయి శ్యామ్ సాయి శ్యామ్ సాయిరాంనేను నాదనెడి భావము చేత
బంధింపబడిన బడుగు జీవులకు
అజ్ఞానముతో అలమటించెడి
అసలు సత్యమును తెలియని వారికి ॥భగవన్నామమే॥
ఆనందమునకు పాకులాడుచు
అది ఐహికమున కలదని
అందురు కామాదులలో పరిభ్రమించుచు
అశాంతితో కూడా తోడ జీవించు వారికి ॥భగవన్నామమే ॥
వాల్మీకి వ్యాస మహర్షులందరు
తుంబుర నారద గంధర్వులందరు
త్యాగయ్య అన్నమయ్య భక్తాదులెందరో
మైమరచి స్మరించి పులకించి తరియింప ॥భగవన్నామమే॥
Comments
Post a Comment