7 March (07.03.) (67)
శ్రీ శారదా శ్యామ సందేశం:
బాధలో కానీ, ఆనందంలో కానీ శరీరము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న నూ హృదయపూర్వకముగా భగవంతుని ప్రార్థించవలెను.
Whether in sorrow or in happiness or in any circumstance of the body, wholeheartedly we should pray to God. (7 Mar)
67) రమణ రమణ భగవాన్
రమణ రమణ భగవాన్ రమణ రమణ రమణ రమణ రమణా యనరే॥
మరణ మనిన చింతించే మనసును గనరే
మాయ మనసును గనరే మన మనసును గనరే॥
మాయ మనసును గనరే మన మనసును గనరే॥
భగవాన్ రమణ రమణ రమణ రమణ రమణా యనరే ॥
నేనెవరని పరికించెడి మార్గము గనరే దివ్య మార్గము గనరే
రమణ మార్గము గనరే సులభ మార్గము గనరే
నేనెవరని పరికించెడి మార్గము గనరే దివ్య మార్గము గనరే
రమణ మార్గము గనరే సులభ మార్గము గనరే
సాయి మార్గము గనరే ॥
నేను నీవు నశించెడి భావము గనరే
సద్భావము గనరే
సాయి భావము గనరే
రమణ భావము గనరే
రమణ రమణ రమణ రమణ రమణాయనరే ॥
ప్రారబ్దము నడిపించెడి తీరును గనరే
లోకతీరును గనరే
లోకేశ్వరు సేవించడి పదమును గనరే
దివ్య పదమును గనరే
రమణ రమణ భగవాన్ రమణ రమణ భగవాన్ రమణ రమణ రమణ రమణ రమణాయనరే ॥
అరిషడ్వర్గములు వర్గములు జేయు వింతలు గనరే
వింత వింతలు గనరే
వింత వింతలు గనరే
వింతల నశింపజేయు చరణము గనరే
రమణ చరణము గనరే
శ్యామాదులు సేవించడి చరణము గనరే
రమణ చరణము గనరే
॥రమణ రమణ భగవాన్ రమణ రమణ భగవాన్
రమణ రమణ రమణ రమణ రమణాయనరే॥
Comments
Post a Comment