21 March (21.03.) (81)
శ్రీ శారదా శ్యామ సందేశం:
ఆరోగ్యంగా ఉన్న శరీరానికి 6 గంటల నిద్ర చాలు.
For a healthy body, 6 hours sleep is enough. (21 Mar)
81) ఒక పరి నిన్ను మనసారగ నమ్మిన
ఒక పరి నిన్ను మనసారగ నమ్మిన -
వారల ప్రేమగ కరుణించెదవూ !
ఒకపరి నిన్ను శరణాగతి వేడిన -
వారల బరువుల భరించెదవూ !
నీ ప్రేమ అనంతమూ - దయ అపారము
కరుణ అనూహ్యము సాయి రామా -
శరణం సాయిరామా శరణం సాయిరామా ॥ఒకపరి॥
పాపాత్ముల పరిరక్షణ చేయగ
మానవ రూపము ధరియుంచితివి
పరిశుద్ధాత్ముల పరమును జేర్చగ
పరమాత్ముడవై ధర వెలసితివి
సకల జీవులను సంరక్షించగ
సాయినాధునిగా భువి నిలచితివి ॥నీ ప్రేమ॥
కులమత రహితము జాతి కతీతము
సంతస భరితము సర్వోన్నతము.
సర్వ సమ్మతము సూన్రుత సహితము
సుందర చరితము మంగళకరము
సద్గతి భరితము సజ్జన హితము
సోహం నాదము దైవ విధానము ॥నీ ప్రేమ॥
Comments
Post a Comment