25 March (25.03.) (85)
శ్రీ శారదా శ్యామ సందేశం:
అన్నం ఆయనే, బియ్యం ఆయనే, అన్నీ ఆయనే, అంతటా ఆయనే అన్న భావన రావాలి.
He is the Food, He is the Rice, He is Everything, He is Everywhere. This feeling should come. (25 Mar)
85) కరుణ జూపుమా - సాయి కనికరించుమా
కరుణ జూపుమా - సాయి కనికరించుమా
పటములోని రూపముతో మమ్ము పలకరింపుమా
పటంలోని రూపముతో మాకు కానుపింపుమా ॥కరుణ॥
మానవుల మైనందున మాయల బడి ఉన్నందున
పరోక్షముగ కనిపించెడి నిన్ను తెలియలేమైతిమి
పటములోని రూపముతో దర్శనమిడి బలుకరించ
ఆత్మానందముల నొంది కృతార్థులము మేమగుదుము ॥కరుణ॥
నీ దర్శనమెనరించిన నిర్మూలనమౌ కర్మలు
నీ పలుకుల వినినంతనే నిచ్చలమౌ మాది మనసు
నీ ఆశీస్సుల బడసిన నీ దరి వీడగలేము
నీ దయతో తరియుంతుము నిజము శామసన్నుతా ॥కరుణ॥
దేవతలలో నిన్ను చూచి అర్చించగ లేమయితిమి
మహాత్ములలో నిన్ను జూచి సేవింపగా లేమైతిమి
జీవులలో నిన్ను చూచి ప్రేమించగ లేమైతిని
విశ్వములో నిన్ను చూచి ధ్యానించగ లేమైతినే ॥కరుణ॥
Comments
Post a Comment