27 March (27.03.) (87)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

సాధన విషయములో నడక పనికిరాదు. పరిగెత్తాలి.
In practice, Walking is useless, Have to run. (27 Mar)


87) కనికరింపుమా దేవ కారుణ్య నాథా

కనికరింపుమా దేవ కారుణ్య నాథా

కలత బాపుమా వేగ శ్రీ సాయినాథా ॥కనికరింపుమా॥


తల్లి తండ్రి గురు దైవము లీవేనని దలచితిరా 

సుఖ దుఃఖము లందు నిన్ను మరువక పూజించితిరా

కంటికి రెప్పగా కాపాడు దైవమా

కనుల నీరు తుడవగా కదలిరావదేలరా ॥కనికరింపుమా॥


ఈ మాయా మోహము లో తగులు కొనిన వాడరా

మమ కారములన్నీ దాటి వెలికి రాని వాడరా

ఏ తీరుగ బ్రోతువో ఏ తీరుగ గాతువో 

నీ పదములే శరణంబని నమ్మియున్న వాడరా ॥కనికరింపుమా॥



Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)