17 March (17.03.) (77)
శ్రీ శారదా శ్యామ సందేశం:
ధర్మ మార్గం అవలంబకుని ధర్మమే కాపాడి సంరక్షించును. అధర్మ మార్గావలంబకుని అదియే శిక్షించి భక్షించును.
Adopt the path of Virtue Virtues itself protects and preserves. Following the path of unvirtues that only will punish and eat you. (17 Mar)
77) ఇది ఏమీ ఆటరా తండ్రీ !
ఇది ఏమీ ఆటరా తండ్రీ ! ఇది ఏమి వేడుక దేవా!
ఇటు నటు నూపుచు అటు నిటు జేర్చక ఆడించుచున్నావు సాయి.. ॥ ఇది॥
భక్తి తోడ నిను తలచ దలంచిన భవ భంధములు బంధము లాయెను
నీదు లీలలను గానము జేయగ నెంచిన నా మది నిలువకపోయెను
లోకవాసనల వ్యామోహములతో మంచి చెడుగల విచక్షణ లేక
గ్రుడ్డివానిగా బ్రతుకుచు నుంటిని పిచ్చివానిగా వాగుచు నుంటిని ॥ఇది ॥
పరబ్రహ్మమే నీవనడి నిజము పరిపూర్ణముగా తెలియక నైతిని
బాధ్యతలను భరియంచెడి నిన్ను భక్తిగా నెపుడు గొలవ నైతిని
సర్వము నీదని అనుకొనుచు నాది యనుచునే భ్రమ పడుచుంటిని
జ్ఞానము నొసగక శ్యామను ఈ భువి అవివేకముతో బ్రతుకగ జేయగా ॥ఇది॥
Comments
Post a Comment