12 March (12.03.) (72)
నిద్ర లేచిన తర్వాత నాలుగు ప్రశ్నలు వేసుకోవాలి ఎందుకు లేచాను, ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఏ విషయం కోసం.
After waking up, four questions to ask ourself . Why did I wake up, what to do, how to do, for what reason. (12 Mar)
72) దయ చూపి ప్రేమతో దరి చేర్చుకోవా !
దయ చూపి ప్రేమతో దరి చేర్చుకోవా !
నీ పాదముల చెంత పడి ఉండనీవా!...
చాలు నీ సంసారము సాయిరామా !..
ఆదరించగ రమ్ము ఆత్మాభిరామ !..
శ్రీరామ రఘురామ శృంగార రామా
జయ రామ జయ రామ జానకి రామా...॥ దయ ॥
సంసారమును జేయ సకల వ్యామోహములు
బంధించి బాధించి కృంగజేయుచునుండె
ధర్మ మార్గములను తప్పించు చుండె
దైవ భావములను దరి చేర్చకున్నాయి..॥ దయ॥
సకల విశ్వమునందు నీవున్న గాని
చూడగలిగెడి శక్తి నాకు లేదయ్యా
అవతార రూపమే ఆరాధనము చేసి
అందుకో దలిచితినయ్యా నీ దీవెనలు ..॥దయ ॥
భక్తిశ్రద్ధల తెలియలేని మూర్ఖుడనయ్యా
నిష్ట సబూరులను నిలుపుకోలేనయ్య
పూజ చేయగలేని పరమ నీచుడనయ్యా
ప్రతితుడను నీ పాల బడితి నేనయ్య
నాకేమీ కావలెను నేనెరుగలేను
నేనేమి చేయదునో తెలియలేను
నీ పరము చేసుకొని నన్నేలుకోవా
శ్యామచరణుని నీలో కలుపుకోలేవా..॥ దయ॥
Comments
Post a Comment