20 March (20.03.) (80)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

చేసే ప్రతి పని భగవంతునిదే అనే భావం ఉండాలి. ఈ శరీరం, మనస్సు, బుద్ది అనునవి అర్హత సంపాదించుకుంటే గురువు దారి చూపిస్తాడు.

Feel that, Every work belongs to God. If this body heart mind are eligible Guru shows route (20 Mar)

80) ఏల కానరావయ్య బృందావన విహారా
ఏల కానరావయ్య
బృందావన విహారా
ఎందుకు దాగినావయ్యా
రాధా మానస చోరా ॥ఏల॥

పున్నమి వెన్నెల రాత్రులు, కన్నుల పండువు జేయగ
నానా విధ సుమ బాలలు సుగంధముల విరజిమ్మగ
సుందర యమునా తీరము నీ రాకకు తపించగ
చల్ల చల్లని పిల్లగాలి నీ కొరకటు నిటు దిరుగగ ॥ఏల॥

చిరుమువ్వల సవ్వడులు ఘల్లు ఘల్లు ఘల్లుమనగ
మురళీనాదము మోహనరాగ మాలపించగా
సమ్మోహనమున జగమే సంతసమును బొందగా
నీ పద భక్తులు నీకై పరిపరి విధముల వేడగ ॥ ఏల॥




Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)