22 March (22.03.) (82)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

పాక్షిక శరణాగతి అయినా చేయాలి. ఉదాహరణ:కాఫీతో మొదలుపెట్టండి. కాఫీ, వాళ్ళు ఇచ్చే దాకా అడగకూడదు. ఎక్కువ ఇచ్చినా, తక్కువ ఇచ్చినా ఇన్ని ఇచ్చారు, అన్ని ఇచ్చారు అని అనకూడదు. చక్కెర ఎక్కువ, తక్కువ అనకూడదు. ఈ ఒక్కటి అయినా ఆయనకు ఇవ్వవలెను.

Partial surrender should be done. Example: Start with coffee. Do not ask Coffee until they give. Do not say Give more, give less, only this much. Sugar should not be high or low. Atleast this should be given to him. (22 Mar)
 
82) కనుల నీరు తుడవగా కదలి రావ దేలరా
కనుల నీరు తుడవగా కదలి రావ దేలరా
కలతలను బాపి నాకు కానుపింప వేమిరా
ప్రభో ! సాయి దేవరా పలుక కున్నా వేమిరా
శరణంటిని దేవరా సతతము నను గావరా ॥కనుల॥

పూర్వజన్మ కర్మ ఫలము, నీ లీలా సంకల్పము,
మహాత్ముల శాప ఫలము , దుచ్చరియల ప్రతిఫలము,
సమస్యలకు పరిష్కార వమింత దనుక కలుగ లేదు
సతమతమౌ హృదయంబున శాంతి అయిన నిలువలేదు ॥ కనుల ॥

వివాహముల జేయనెంచి వినయంబుగా నిను వేడగ
నిమ్మకు నీరెత్తినటుల నిచ్చలముగా కూర్చుంటివి
ఇలు వెడలిన తమ సుతుని వెదకుచున్న నీ వారికి
సంతసముల నీయకుండ వూరకే జూచూచు నుంటివి ॥ కనుల॥

వివాహముల జేయించుము ప్రేమ సాయి దేవరా
ఇలు వెడలిన సుతుని దిరిగి గృహమునకు జేర్చరా
నీ శక్తిని, నీ మహిమను, నీ కరుణను, నీ ప్రేమను,
నిను నమ్మిన భక్తుల కిల నిదర్శనగ జూపరా॥ కనుల॥

Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)