11 March (11.03.) (71)
శ్రీ శారదా శ్యామ సందేశం:
ఇతర జీవులు మన జీవిత సంఘటనలకు కారకులని మనము భావించిన, ఆ భావనలు కోట్లాది జన్మలను (ఆగామి) తెచ్చిపెట్టును.
If we think that other creatures are responsible for our life events, those feelings will bring billions of births. (11 Mar)
71) ఏ ప్రాంత మందున జనన మందితివో
ఏ ప్రాంత మందున జనన మందితివోకులమేమో ? మతమేమో? నీదు పేరేమో?
తెలియగ లేరయ్యా ! రూప గుణ రహితా
రామ శివ మారుతి దత్త గురు సాయి...
పత్రి గ్రామము నందు జనన మందితి వంట
జమునా భాయ్ నందలాలు తనయుడవు నీవంట
బాల్యమునందే ఒక ముస్లిం ఫకీరు కడ
ప్రేమ వాత్సల్యముల పొంది పెరిగితివంట...
నీదు సంకల్పమున వేంకుసా గురుజేరి
శుశ్రోషలను చేసి కర్తవ్య మెరిగి
గురుని ఆజ్ఞల బొంది గోదావరిని చేరి
ఆ చెంతనే నున్న షిరిడీ చేరితివంట....॥ ఏ ప్రాంత॥
బాధితుల నందరిని బాగుపరిచితివంట
సద్భక్తులకు ముక్తి పథము నిచ్చితివంట
నమ్మి నిను జేరడి భక్తులందరగాచి
నిన్నే కొలుచు శ్యామచరణుని గాచి
రక్షించి బ్రోచుచు నిలిచి ఉన్నావంట ॥ఏ ప్రాంత॥
Comments
Post a Comment