18 March (18.03.) (78)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

అప్పుడే జననమొందిన శిశువునకు అహంకారము, కోరికలనే సంస్కారములు ఉండనందున దాని సంరక్షణ బాధ్యతలను తల్లి చూచుకుంటుంది. ఆ శిశువే ఎదిగాక తన అహంకారము, కోరికల సంస్కారముల వల్ల తల్లికి దూరమవుతుంది. అలానే దైవం/గురువు పట్ల నీ ప్రవర్తన ఎటులో, ఆయన ప్రతిస్పందన అటులనే ఉంటుంది.

Newborn baby don't have the culture of ego and desires. So mother take cares of their responsibilities to protect them. As the child grows older, their ego and desires will lead them away from mother. Similarly based your attitude towards the God/Guru, responses will be there. (18 Mar)
 

78) ఏదని దలతును నీ రూపమును

ఏదని దలతును నీ రూపమును
ఏమని బిలతును నీ నామమును
లీలా నాటక సూత్రధారి
హే! మాయా మానుష వేషధారి ..॥ఏమని ॥

ఇది యది యనక అన్ని రూపములలో
నున్నది నీవే యని దెలుపుచు
సర్వనామముల కధిపతి నీవై
సమతా మమతలను నిలిపిన దేవా ॥ ఏమని॥

రామ, కృష్ణ ,శివ, దత్త ,మారుతి,
రహీము, అల్లా, యెహోవా, క్రీస్తు,
నానకు, నారాయణి శక్తులుగా
దర్శన మెసగిడి శ్యామ సన్నుతా ॥ఏమని॥


Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)