28 March (28.03.) (88)
శ్రీ శారదా శ్యామ సందేశం:
బుద్ధి వికసించిన సదసత్
వివేకము ఉదయించును. సదసత్ వివేకము వలన వినయము లభించును. వినయము వలన సూక్ష్మ
గ్రాహక శక్తి అంచెలంచెలుగా పెంపొందును. సూక్ష్మ గ్రాహక శక్తి వలన సారాసార
విచారణ కలుగును. సద్విచారణ వలన విషయ వాసనల విశ్లేషణ జరుగును.
Wisdom
will rise when intelligence blossoms. With Wisdom Humility will obtain.
Humility will slowly enhances the micro-perceptiveness.
Micro-perceptiveness causes an absolute inquiry. Due to indeed inquiry
"Subject Odor Analysis" is done. (28 Mar)
88) కొలువై యున్నాడే
కొలువై యున్నాడే
మన సాయి రాముడు
కొలువు దీరిచి యున్నాడే
ఘనముగా మన శ్యామ సన్నతుడు ॥కొలువై॥
మాతాపిత గురుదైవము తానై
మందహాసముతో ముచ్చట గొలుపగ
భక్తులారా రండు రండనుచు ఇక
భయము మీకేల వలదు వలదనుచు ॥కొలువై॥
మీ భారంబుల నాపై వదలడు
సర్వము నేనే మోయు చుందునని
నిష్ట సబూరుల గలిగి యుండుడని
అవియే సకల శ్రేయముల గూర్చునని ॥కొలువై॥
Comments
Post a Comment