Posts

Showing posts from January, 2022

31 January (31.01.) (31)

Image
శ్రీ శారద శ్యామ సందేశం: ఏ కార్యక్రమములో కూడా సోమరితనము మహా ప్రమాదకరము. Laziness in any event is extremely dangerous. (31 Jan)   31) ఆవోసాయి ఆవోసాయి నారాయణ దరిశన దియో తుమ్ హో జగతికే త్రాతా  తుమ్ హో భాగ్య విధాతా ॥ ఆవో॥ త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ విశ్వవిధాతా……..  త్వమేవ సర్వవిధాతా ॥ ఆవో॥ త్వమేవ బ్రహ్మ త్వమేవ విష్ణు త్వమేవ శంకర రూపా -  త్వమేవ దత్త స్వరూపా ॥ ఆవో॥ త్వమేవ రామా… త్వమేవ కృష్ణా త్వమేవ శిరిడి సాయి బాబా….  త్వమేవ సత్యసాయిబాబా ॥ ఆవో॥

30 January (30.01.) (30)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: బాహ్య ఆడంబరములు లోకుల కొరకే గానీ మరెందుకూ కొఱగావు. నిరాడంబరమగు అంతఃకరణము నందుండి పెల్లుబికెడి ప్రేమతో పిలిచే పిలుపునకే శ్రీగురుడు ప్రసన్న వదనుడై పలుకుతాడు. External luxuries are only for worldly people but not for anything else. From the modest intuition, at the call of love, SriGuru becomes pleasent and speaks with joy. (30 Jan) 30) ఇది ఏ కర్మ ఫలితమొ ఇది ఏ కర్మ ఫలితమొ, ఏ గ్రహ ఫలితమొ నీ ఆగ్రహ ఫలితమొ, అనుగ్రహ ఫలితమొ దెలియని వాడను సాయి భగవాన్ భగవాన్, భగవాన్, భగవాన్, భగవాన్, సాయి భగవాన్ ||ఇది || మనసును స్థిరముగ నీ పద పంకజ ధ్యానము నందున నిలువనీయవు సతతము భగవన్నామ స్మరణమును, జేయగ నీయక శోధించెదవు || ఇది || ఐహిక చింతనల కలిగింతువు దుశ్చింతనలను మది రగిలింతువు అది ఇది నెరుగని స్థితిలో నుంతువు ఆట బొమ్మగా నన్నాడింతువు || ఇది || ఎన్నడు నీ స్థితికి చేరుదునో జన్మ పరం పరలెపుడు దాటుదునో ఎయ్యది నీ పద సన్నిధి నొసగునో దెలియని గతి లో శ్యామ యుండగ || ఇది ||

29 January (29.01.) (29)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: ఆలోచనారహితమయిన స్థితిగలిగినపుడే శాంతి, విశ్రాంతి. గురువును ఆశ్రయించి, విశ్వసించి, ఆయన చెప్పిన దానిని విజ్ఞతతో చేస్తూ, చేయడం కర్తవ్యంగా భావిస్తూ, గురువును శంకించకుండా 12 సంవత్సరములు పడిఉంటే ఆ స్థితి వస్తుంది. Peace and Relaxation is in the state of thoughtlessness. Rely on the Guru, trusts him, wisely do what he says, feels it is your duty to do so. 12 years without doubting , believe Guru, you will be in that state. (29 Jan) 29) ఆగింరపుమా ఆగింరపుమా ! ఫలము లారగింపుమా ! పరమాత్మా సాయీశ్వర, పరమ కృపాసాగర || ఆరగింపుమా || సర్వము నీదే యైన నూ, నాది యనెడి అహము తోడ నైవేద్యం బిడు చుంటిని నవ్వకుమా నాగసాయి ||ఆరగింపుమా || విశ్వమెల్ల నిండి యున్న నీ విటనే ఉన్నావని అజ్ఞానముతో దలచుచు కుడము నారగింపవేడితి ||ఆరగింపుమా|| మాయాతీతుడవైనను మాయకు లోబడి నిన్నొక మహాత్మునిగా భావించి నివేదనల చేయుచు నుంటి || ఆరగింపుమా|| రూపాతీతుడవైనను నిన్నొకరూపమున దలచి అవివేకముతో నలుగుచు ఆహారములను దెచ్చితి || ఆరగింపుమా || మాయకు లోబడి యుంటినో, అమాయకునిగనుంటినో ఎటు దలచిన నీవెగాదె నైవేద్యమ...

28 January (28.01.) (28)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: ఎవ్వరూ శాశ్వతంగా బాధపడరు. ప్రతివారూ అనాధలే, దైవ నివాసమే అందరి అనాధశరణాలయం. నిన్ను దరిజేర్చుకొమ్మని దైవాన్ని పట్టుకుని ప్రార్థించు. No one will suffer forever. Everyone is an orphan, and God's abode is everyone's orphanage. Hold on to God and pray He will guide you. (28 Jan) 28) అపార కరుణాసాగరా అపార కరుణాసాగరా - అనంత ప్రేమమందిరా, సమర్ధ సద్గురు సచ్చిదానంద సాయినాధ మహరాజ ॥అపార॥ అభయప్రదాత, అనాధరక్షక, ఆశ్రిత పోషక, నమో నమో…. ఆపద్భాంధవ అనంత మహిమా లీలా వినోది నమో నమో…. ॥అపార॥ భవ భయనాశక భక్తి ముక్తి ప్రద భావాతీత నమో నమో…. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపా బంధనాశక నమో నమో…. ॥అపార॥ ఆది మధ్యాంతరహిత పరాత్పర అది దేవ గురు నమో నమో…. అనంత సృష్టి స్థితి లయకారక అత్రీనందన నమో నమో…. ॥అపార॥ సత్య ధర్మ శాంతి ప్రేమ ప్రదాతా సచ్చిదానంద నమో నమో…. సజ్జన సన్నుత ముని జన వందిత మోహన రూపా నమో నమో…. ॥అపార॥ కామ క్రోధ మద మత్సర లోభ మోహనాశక నమో నమో….. కాల స్వరూపా కాలాతీతా కర్మవినాశక నమో నమో…. ॥అపార॥ సంశయనాశక, సద్గురు నాయక సద్గతిదాయక నమో నమో…. సకల చరాచర వాసా పరేశా శ్యామేశా ప్రభు నమో...

27 January (27.01.) (27)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: యోగాభ్యాసముల వలన శరీరము బాగా ఉంటుంది. ఆ అభ్యాసముతో, కూడా భగవన్నామమును జతపరచుకొనుట లాభదాయకము. Yoga exercises keep the body well. With that practice, associate with divine name chanting it is beneficial. (27 Jan) 27) నీవెంతటి దొంగాడవు అహాహాహాహా....... నీవెంతటి దొంగాడవు రా బంగారు సాయీ, అడిగినదెల్లా నాకు వెను వెంటనే అందించి, అదృశ్యముగా నిలిచి ఆడించు చున్నావు. ॥అహాహా॥ భక్తి నడుగ దలచినంత భుక్తి నడుగ జేసెదవు. ముక్తిని కోరగ నెంచిన యుక్తిగ తప్పించెదవు నీయందనురక్తి నెపుడు పెంచనీక ముంచెదవు వంచిన, ముంచిన, త్రెంచిన, నిన్నొదలి పోదునా ॥అహాహా॥ నీ నామ స్మరణమె నా కిహపరముల భుక్తి నీ రూప ధ్యానమే నా కెన్నటికైనా ముక్తి నీలీలాగానములే పెంచును అనురక్తి నీ చరణములే శరణము శ్యామచరణ వందితా ॥అహాహా॥

26 January (26.01.) (26)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: ఓర్పు రావాలి అంటే తనకు ఇష్టమైన దైవమును/గురువును విశ్వసించి జరిగేదంతయూ దాని సంకల్పమేనని అది మన మేలునకేనని, ప్రతి విషయములోని మంచిని గ్రహించడానికి తీవ్రముగా ప్రయత్నించి, మంచిని గ్రహించగలిగే వివేకమును సంపాదించుకొనుట వలన భగవత్తత్వము/ గురుతత్త్వము యొక్క శక్తిని గుర్తించుటకు వీలు అగును. Patience need to comes from believing in one's favorite God/Guru, and everything that happens is with their Will for our Welfare. Acquiring wisdom to perceive the good in everything, Can discern the Concent of God/Guru philosophy. (26 Jan) 26) ఇది నీ లీల కరుణా లోలా ఇది నీ లీల కరుణా లోలా శ్రితజనపాల షిరిడి వాలా ॥ఇది॥ లోకమున గల బాధల వేల నాకము నరకము మాటల వేల ఇహపర సుఖముల యోచన లేల నీ పదములను నమ్మిన వేళ ॥ఇది॥ బరువు బాధ్యతల చింతన లేల పాప పుణ్యముల పలుకుల వేల తీర్థయాత్రులలో తిరుగుట దేల నీ చరణములను నమ్మిన వేళ ॥ఇది|| గురువుల కొరకు వెదుకగనేల ఉపదేశంబుల కోరుటదేల నిష్ఠ సబూరుల వదలని వేళ శ్యామసాయి దయ కలిగిన వేళ ॥ ఇది॥

25 January (25.01.) (25)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: ఓర్పు, హృదయపూర్వక ప్రేమ, దైవిక లక్షణములు, మంచి ఆలోచనలు, దైవము/గురువు యందు నమ్మకము మరియు ఆత్మవిశ్వాసములతో మనము ప్రపంచమునే జయించవచ్చు. ఇవన్నీ లేనప్పుడు మనము ఏమీ సాధించలేము. With patience, heartful love, divine qualities, good thoughts, faith and self-confidence in God/Teacher we can conquer the world. Without all this we can achieve nothing. (25 Jan) 25) ఆటలనాడుచు నుంటివి దేవ ఆటలనాడుచు నుంటివి దేవ! వేడుక జూచుచు మహానుభావా ॥ఆట॥ ఆటల నాడగ వేడుక జూడగ, మేమెంతటివారము సాయిదేవా ॥ఆట॥ అహమున ముంచుచు నుంటివి దేవా మోహము బెంచుచు నుంటివి దేవా అహమున ముంచుచు మోహము బెంచుచు ఐహిక చింతల నుంచుచు దేవా ॥ఆట॥ కామమ్ము ను కలిగించుచు దేవా క్రోధమ్ము ను రెట్టించుచు దేవా కామ క్రోధ కందకముల ద్రోయుచు, కష్టములను కలిగించుచు దేవా ॥ఆట॥ మదమును లోలో పెంచుచు దేవా మత్సరమును కలిగించుచు దేవా మదమత్సరములలో బడ వైచుచు మంచిని మరువగ జేయుచుదేవా ॥ఆట॥ స్వార్థంబును మదిబెంచుచు దేవా లోభంబును కలిగించుచు దేవా స్వా ర్థలోభముల మదిరగిలించుచు మాయలలో బడద్రోయుచు దేవా ॥ఆట॥ సకలము నీదని నెంచుచు దేవా సతతము నిన్...

24 January (24.01.) (24)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: అంతటా భగవంతుని చూడగలిగే ప్రయత్నమే నిజమైన సాధన. The endeavours to see the God everywhere is the real exercise. (24 Jan) 24) అలిగితివో ఆగ్రహించితివో అలిగితివో ఆగ్రహించితివో మందభాగ్యుడని మదినెంచితివో ! దుర్మార్గమ్ములో జేసిన దోసగుల క్షమియింపుము కరుణించుముసాయి || అలిగితివో॥ సతతము నీ నామమునేదలపక సర్వము నీ కర్పణ జేయక సాయీ సాయీయని సంతాపములలో బిలచుచు, బలుకుచు, పిడించితినని ॥ అలిగితివో ॥ నాదను భావము లోలోనుండగ, సర్వము సాయి యిచ్ఛయేయనుచు బలుకుచు స్వార్ధముతో జీవించుచు, నీ కపకీర్తిని దెచ్చుచుంటినని, ॥ అలిగితివో || అసత్యమాడుచు అహమున దిరుగుచు అధర్మ మన్యాయముల తో బద్రుకుచు కామ మోహమ్ముల వలలో గ్రుక్కుచు, మ్రొక్కుచు నీవేశరణ మంటినని ॥ అలిగితివో || ధ్యాన సాధనల జపముల జేయక నిష్ఠసబూరుల కలిగియుండక భక్తిశద్ర్ధవిశ్వాసములుండక శ్యామ చరణుడు సంచరించునని ॥ అలిగితివో ||

23 January (23.01.) (23)

Image
శ్రీ శారద శ్యామ సందేశం: ప్రేమ, సేవ, క్షమ గుణములతో ప్రపంచమును జయించగలరు. క్రోధము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, అసంతృప్తులతో తమ మనుషులను/మనసులను కూడా జయించలేరు. కదా, కాదా? Can conquer the world with the qualities of love, service and forgiveness. Can't even conquer their own people / minds with anger, jealousy, envy, hatred, dissatisfaction. Yes! Isn't? (23 Jan) 23) అర్ధించుచుంటినని అర్ధించుచుంటినని అందలము పైకెక్కి అవహేళనల పాల జేయకయ్యా ప్రార్థించు చుంటినని పరిహాసమాడుచూ పది మందిలో కించ బరచకయ్యా దేవా...సాయిదేవా రావా నన్ను కావరావా ||అ|| కోర్కెలధికములనుచు కోపమ్ము జెందితివా ఆశలధికములనుచు ఆయాస పడితివా కోర్కెలు ఆశలు నీ అధీనములే గదా! నేర్పుగా నడిపించి నీ దరికి జేర్చమని ||అ|| కాముకుడు వీడనుచు కరుణ మానితివా మోహ మత్యధికమని మూగబోయితివా. కామ మోహమ్ములు నీ సంకల్పమేగదా. సద్భుద్ధులొసగి నీ కరుణ ప్రసరింపమని ||అ|| బలహీనతల వలలోన బందీగ మారాను.. అస్తవ్యస్తపు మార్గముల నడచుచున్నాను. సర్వభారంబులను నీ పరము జేశాను. శ్యామ సన్నుత సాయి కావరావే యనుచు ||అ||

22 January (22.01.) (22)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: నీళ్ళ వల్ల దేహం శుభ్రపడుతుంది. జ్ఞానం వల్ల మేధస్సు వికసిస్తుంది. సత్యం వల్ల మనస్సు ఉద్దీపిస్తుంది. అహింసవల్ల ఆత్మ ఉజ్జ్వలనమవుతుంది. విద్య యొసగును వినయంబు, దైవానికి శరణుచెందు, పతనంగాకు. Water cleanses the body. Wisdom develops Mind. Truth stimulates the heart. Non-violence enlightens the soul. Education enhances humbleness. Don't fall, surrender to God. (22 Jan) 22)  దత్త శరణం సాయి శరణం దత్త శరణం సాయి శరణం  దత్త సాయి శరణం శరణం ॥    దత్తా సాయి శరణం శరణం  సాయి దత్త శరణం శరణం భువనేశ్వరా అఖిలేశ్వరా  గుణగంభీరా సాయిశ్వర ॥దత్త॥    దేవకి నందన శ్యామా సాయి  దశరథ నందన రామా సాయి  శ్యామ సాయి రామా సాయి  శ్యామా రామ సాయి సాయి  రామా శ్యామ సాయి సాయి  సాయి సాయి శ్యామ రామా  సాయి సాయి రామా శ్యామా రామ సాయి రామా సాయి  రామా సాయిరామా శ్యామ సాయి  శ్యామా సాయి శ్యామా సాయి శ్యామా మాధవ మురహర శ్యామా  సాయి రాఘవ సురవర రామా సాయి దేవకి నందన శ్యామా  సాయి దశరథ నందన రామా సాయి శ్యామ ...

21 January (21.01.) (21)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: గాలి మేఘాలను కలుపుతుంది, అదే గాలి మళ్ళీ వాటిని చెదరగొడుతుంది. అదే విధంగా మనస్సు మనుష్యుల బంధానికీ, మోక్షానికీ కారణమవుతోంది. The wind connects the clouds, and the same wind scatters them again. In the same way the heart is causing the bondage and salvation of human beings. (21 Jan) 21) నీకున్న బలమెంత నీకున్న బలమెంత బంధుబలగమెంత చదువు సంధ్యల వెంత శ్యామా? నీకున్న ధన ధాన్య భోగ భాగ్యము లెంత సద్గురుని యందు నీ విశ్వాసమెంత శ్యామా...... ఆ........ ఆ అహము మోహము లందు వ్యామోహమెంత కామ క్రోధములందు మమకారమెంత మద మాత్సర్యములందు సహకారమెంత నీకు సహకారమెంత ||నీకున్న|| దారా పుత్రాదులతో నీ ధర్మమెంత ఆహారముల యందు ఆసక్తి ఎంత సజ్జనులతో మెలుగు సద్భావ మెంత సకల జీవుల యందు అనురాగమెంత ||నీకున్న|| నాది నాదని బలుకు నీదు తెలివెంత నాది నీదని బల్కు నీదు మనసెంతా ఆనందమందుటకు ఆచరణ ఎంత అసలు నీవెంత నీ అధికారమెంత ||నీకున్న||

20 January (20.01.) (20)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: సారము లేని, మిక్కిలి ఆలోచనలు మానవశక్తిని నశింపచేస్తాయి. నిరంతర కృషి మిక్కిలి ఆలోచనలను తగ్గించగా, నిష్కల్మషమైన భక్తి, ఆలోచనల సారమును పెంపొందించును. Essenceless, extreme thoughts destroy human power. Continuous effort minimizes the extreme thoughts, while cultivating pure devotion will increases the essentials in thoughts. (20 Jan) 20) నీ ముందు నేనెంత నీ ముందు నేనెంత యనెడి భావన తోడ ప్రారంభమయినది మన బంధము నిను వదలి జీవించలేననెడి భావనతో సాగుచున్నది సాయి అనుబంధము మధురాతి మధురమౌ ఈ బంధము మహిత మనోహరపు అనుబంధము సంతసమ్మొనగూర్చు సంబంధము విడదీయ లేనిదీ ఋణబంధము ॥నీ ముందు॥ చిత్రాతి చిత్రమౌ సంకెలల లంకెలతో బ్రతికించుచున్నది బుణబంధము ఏవేవో కర్మలను ఎట్టెటులో జేయించి జన్మలొసగుచున్నదీ బంధము సర్వము కలిగించి సంత సంబుల ముంచి సాయినే అందించు నీ బంధము కర్మలెన్నియో తెంచి కర్తవ్యమును త్రుంచి కడతేర్చు నీ సంబంధమూ ॥నీ ముందు॥ ప్రతి క్షణము ప్రతిప్రాణి పయనించుచుండుటకు మూలాధారమ్ము ఈ సంబంధము స్థావర జంగమము లన్నిటికి హేతువై లోతుగా నున్నదీ అనుబంధము సకల చరాచర విశ్వమే తానై సాయిగా శ...

19 January (19.01.) (19)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: మహాత్ముని వద్ద కానీ లేదా గురువు వద్ద కానీ తరచూ కొంత సమయం గడుపుచుండుట వల్ల నీ ఆధ్యాత్మిక పథం నీ అర్హతనుబట్టి ఉన్న తమౌతుంది. Spending time oftenly with Mahatma or Guru that will enhance your spiritual path according to your merit. (19 Jan) 19) నాతో పంతమా నాతో పంతమా నా పాలి దైవమా సాయీ ॥నాతో॥ సుంత యేని మది శాంతి నిలుపవు వింత వింతగా బాధించెదవు ॥నాతో॥ ఎంతగా నిను ప్రార్థించిననూ ఎంతగా నిను వేడుకొనిననూ రవ్వంత యేని కరుణ జూపవు ఒక్క సమస్యను పరిష్కరించవు ॥నాతో॥ సర్వ భారముల నీ పరము జేసి సమస్యలను నీ భుజంబుల మోపి మంచి చెడుగులకు కారణమీవని బలుకుచు భువిలో బ్రతుకుచుంటినని ॥నాతో॥ తామసముతో తడబడు నడుగులతో అలసటతో ఆడంబరములతో అంతయూ నీదయయేయని బలుకుచు ఆడుచుంటినని అల్పుడ నేనని ॥నాతో॥ దండించిననూ దరి జేర్చిననూ పరీక్షించినను పరిరక్షించిన నీవుగాక యింకెవరున్నారని ఆశ్రయింతురా శ్యామ సన్నుతా సాయి ॥నాతో॥

18 January (18.01.) (18)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: భవిష్యత్తును గురించి బాధపడకుండా దైవ సంకల్పానికి మనల్ని మనం సమర్పించుకొనుటయే అత్యున్నత జ్ఞానము. The highest wisdom is to submit ourselves to the Divine Will, without worrying about the future. (18-Jan) 18) నా పూర్వ జన్మ నా పూర్వ జన్మ పుణ్యఫలమొ నీ అనుగ్రహమొ.. నీ పవిత్ర నామమునే వినగలిగితి సాయీ. నీ దివ్య లీలలనే జదువ గలిగితిని సాయీ నీ పద భక్తునిగా భువి పిలువబడుచు నుంటి సాయి ॥నా॥ సాధనలను చేయలేదు, తపముల నొనరించలేదు, యజ్ఞయాగాదుల, నే, నసలే, మదినెరుగలేదు, నీ నామమె స్మరియించుచు, నీ లీలల జదువు చుండ అంతమాత్రమునకే, ఎంతో దయ జూపితివి ॥నా॥ అడుగడుగునా ఆడుకొనుచు అదృశ్యముగా గాచుచు అనవరతము మమ్మెల్లర కరుణతో బ్రోచుచునుంటివి పావన నామా సాయీ పతిత జనోధ్ధారకా సదమల హృదయా దేవశ్యామ సుజన పోషకా ॥నా॥

17 January (17.01.) (17)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: బొట్టు పెట్టుకునే స్థానంలో కానీ, హృదయ స్థానంలో కానీ గురు పాద పద్మాలను చూస్తూ బొడ్డు దగ్గర నుండి (మనసులో) నామము చెప్తూ, వింటూ ఆ నామాన్ని పాదాల మీద పెడుతున్నట్లుగా ఊహించుకుంటూ మొదటిలో సాధకులు ధ్యానాన్ని సాధన చేయాలి. First of all the practitioners, from the blob point or from the heart place looking at the lotus feet of Guru. From the belly (the heart) Chant the name, listen the name. Imagine our chanted name kept on the lotus feet should practice meditation. (17 Jan) 17) నీ దయయే నీ దయయే నా బ్రతుకయ్యా నీ కరుణయే నా జీవితమయ్యా నీ ప్రేమయే నా సంతసమయ్యా నా పాపమే సంతాపము లయ్యా ॥నీ॥ పావనమగు నీ దివ్య నామమును వినగలుగుట నీదయయే గదా పవిత్రమౌ నీ‌ దివ్య చరితమును పఠియించుట నీ కృపయే గదా నీదు లీలలను నిరతము గానము జేయుటయు నీ కరుణగదా మంగళకరమౌ నీదు రూపమును జూచుట నీప్రేమయే గదా ॥నీ॥ నీ నామమే నామనసును స్థిరముగ నీ దరి నిలిపెడి మంత్రమయా నీ చరితమే నా భక్తిని దృఢముగ నీపై నిల్పడి మంత్రమయా నీ లీలలే నా దుష్కర్మలను దనుమార గలుగు శస్త్రమయా నీ రూపమే నా కాత్మ జ్ఞానము నొసగి రక్...