30 January (30.01.) (30)
శ్రీ శారద శ్యామ సందేశం:
బాహ్య ఆడంబరములు లోకుల కొరకే
గానీ మరెందుకూ కొఱగావు. నిరాడంబరమగు అంతఃకరణము నందుండి పెల్లుబికెడి
ప్రేమతో పిలిచే పిలుపునకే శ్రీగురుడు ప్రసన్న వదనుడై పలుకుతాడు.
External
luxuries are only for worldly people but not for anything else. From
the modest intuition, at the call of love, SriGuru becomes pleasent and
speaks with joy. (30 Jan)
30) ఇది ఏ కర్మ ఫలితమొ
ఇది ఏ కర్మ ఫలితమొ, ఏ గ్రహ ఫలితమొ
నీ ఆగ్రహ ఫలితమొ, అనుగ్రహ ఫలితమొ
దెలియని వాడను సాయి భగవాన్
భగవాన్, భగవాన్, భగవాన్, భగవాన్, సాయి భగవాన్ ||ఇది ||
మనసును స్థిరముగ నీ పద పంకజ
ధ్యానము నందున నిలువనీయవు
సతతము భగవన్నామ స్మరణమును,
జేయగ నీయక శోధించెదవు || ఇది ||
ఐహిక చింతనల కలిగింతువు
దుశ్చింతనలను మది రగిలింతువు
అది ఇది నెరుగని స్థితిలో నుంతువు
ఆట బొమ్మగా నన్నాడింతువు || ఇది ||
ఎన్నడు నీ స్థితికి చేరుదునో
జన్మ పరం పరలెపుడు దాటుదునో
ఎయ్యది నీ పద సన్నిధి నొసగునో
దెలియని గతి లో శ్యామ యుండగ || ఇది ||
Comments
Post a Comment