18 January (18.01.) (18)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

భవిష్యత్తును గురించి బాధపడకుండా దైవ సంకల్పానికి మనల్ని మనం సమర్పించుకొనుటయే అత్యున్నత జ్ఞానము.
The highest wisdom is to submit ourselves to the Divine Will, without worrying about the future. (18-Jan)


18) నా పూర్వ జన్మ

నా పూర్వ జన్మ పుణ్యఫలమొ నీ అనుగ్రహమొ..

నీ పవిత్ర నామమునే వినగలిగితి సాయీ.

నీ దివ్య లీలలనే జదువ గలిగితిని సాయీ

నీ పద భక్తునిగా భువి పిలువబడుచు నుంటి సాయి ॥నా॥


సాధనలను చేయలేదు, తపముల నొనరించలేదు,

యజ్ఞయాగాదుల, నే, నసలే, మదినెరుగలేదు,

నీ నామమె స్మరియించుచు, నీ లీలల జదువు చుండ

అంతమాత్రమునకే, ఎంతో దయ జూపితివి ॥నా॥


అడుగడుగునా ఆడుకొనుచు అదృశ్యముగా గాచుచు

అనవరతము మమ్మెల్లర కరుణతో బ్రోచుచునుంటివి

పావన నామా సాయీ పతిత జనోధ్ధారకా

సదమల హృదయా దేవశ్యామ సుజన పోషకా ॥నా॥


Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)