27 January (27.01.) (27)

 శ్రీ శారద శ్యామ సందేశం:

యోగాభ్యాసముల వలన శరీరము బాగా ఉంటుంది. ఆ అభ్యాసముతో, కూడా భగవన్నామమును జతపరచుకొనుట లాభదాయకము.
Yoga exercises keep the body well. With that practice, associate with divine name chanting it is beneficial. (27 Jan)


27) నీవెంతటి దొంగాడవు

అహాహాహాహా.......

నీవెంతటి దొంగాడవు రా బంగారు సాయీ,

అడిగినదెల్లా నాకు వెను వెంటనే అందించి,

అదృశ్యముగా నిలిచి ఆడించు చున్నావు. ॥అహాహా॥


భక్తి నడుగ దలచినంత భుక్తి నడుగ జేసెదవు.

ముక్తిని కోరగ నెంచిన యుక్తిగ తప్పించెదవు

నీయందనురక్తి నెపుడు పెంచనీక ముంచెదవు

వంచిన, ముంచిన, త్రెంచిన, నిన్నొదలి పోదునా ॥అహాహా॥


నీ నామ స్మరణమె నా కిహపరముల భుక్తి

నీ రూప ధ్యానమే నా కెన్నటికైనా ముక్తి

నీలీలాగానములే పెంచును అనురక్తి

నీ చరణములే శరణము శ్యామచరణ వందితా ॥అహాహా॥



Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)