14 January (14.01.) (14)
శ్రీ శారద శ్యామ సందేశం:
ఉచ్ఛ్వాస-నిశ్వాసలకు అనుగుణంగా భగవన్నామము మనసులో చెపుతూ చెవులతో వింటూ ఉండాలి.
According to the inhalation and exhalation, Chant Divine Name in mind and listen with ears. (14-Jan)
14) అనంత మహిమాన్విత
అనంత మహిమాన్విత గురుదేవా.
ఆనందామృత చిన్మయ భావా || గురుదేవా||
సద్గురు దేవా.. సమర్థసద్గు రుసాయిదేవా ||అనంత||
అనంత కోటి బ్రహ్మాండ నాయకా
అనంత గుణ గణ ఆగమ వినుత
అనంత సురగణ మునిజన వందిత
అనంతానంత అమృతానంద || అనంత ||
కామ క్రోధ మద మత్సర నాశక
లోభ మోహ సంశయ వినాశక
చిత్తచాంచల్య కర్మనాశక
సుజన పూజిత సుందరనాయక ॥ అనంత ॥
భక్తి శక్తి చిచ్భిక్తి పద్రాయక,
జ్ఞాన వైరాగ్య ముక్తిదాయక,
సచ్చిదానంద విశ్వవిధాయక,
శ్యామ సేవిత సద్గురు నాయక ॥ అనంత ॥
Comments
Post a Comment