16 January (16.01.) (16)
శ్రీ శారద శ్యామ సందేశం:
సాయి తాతయ్య ఎదురుగా కూర్చుని,
సాయి తాతయ్య కళ్లనుంచి శక్తి వస్తుందని, ఆ శక్తి మన తలనుండి కాలి దాకా
ప్రసరించిందని, ఆ శక్తి మన చుట్టూ రక్షణ కవచంలాగా ఉంది అనుకొని ధ్యానము
చేయాలి.
Sit infront of Sai Baba and meditate,
thinking that the energy transmits from Sai Baba's eye's, that energy
radiates from our head to our toes, and that energy is like a protective
shield around us. (16 Jan)
16) నీ సేవకునిగ
నీ సేవకునిగ నీ బానిసగ
నీ సేవలోన నిరతము నిలుపుము సాయి ॥నీ॥
సర్వము నీ కర్పణము జేయుచు
సకలము నీదేయని మది దలచుచు
సకల విశ్వమున నిన్ను జూచుచు
సంతోషంబు పొందగ చేయుము ॥నీ॥
నీనామామృత పానము జేయుచు
నీ లీలలను గానము జేయుచు
నీ సేవకులకు సేవల జేయుచు
నిరతము సంతసమందున నుంచుము॥నీ॥
ఆశయమీ వై ఆశలు నీవై
ఆచరణ ఆలోచన లీవై
అంతట నీవై అన్నియు నీవై
ఆనందంబు నందింపుము సాయీ ॥నీ॥
నీవే నేనై నేనే నీవై
నిశ్చయ నిశ్చలమగు గతినేనై
నిరుపమానంద ధామము నేనై
వుండగా జేయుము శ్యామ సన్నుతా ॥నీ॥
Comments
Post a Comment