9 January (09.01.) (09)
శ్రీ శారద శ్యామ సందేశం: (9 Jan)
విశ్వాసము కలిగితే ఎటువంటి పరిస్థితులలో కూడా అది సడలదు. మనము జన్మించడం మనము చూడలేదు కానీ మన తల్లి అని మనకు ఎంతో నమ్మకము వుంటుంది. ఎవరెంత చెప్పినా మన మనసులోనున్న మన తల్లి అనే భావనను తొలగించలేరు కదా! విశ్వాసము అలా వుండాలి.
If we have faith, it will never waver under any circumstances. We did not see our birth but we have a lot of faith in our mother. No matter what anyone says, we cannot remove the feeling of our mother in our mind! Faith should be like that.
If we have faith, it will never waver under any circumstances. We did not see our birth but we have a lot of faith in our mother. No matter what anyone says, we cannot remove the feeling of our mother in our mind! Faith should be like that.
9) ఈ జీవిత యాత్రలో
ఈ జీవిత యాత్రలో ఎన్నెన్నో పాత్రలుఏది ఎందులకు ఉద్భవించునో
ఏది ఎందులకు నిష్క్రమించునో
ఎప్పుడు ఉద్భవించునో ఎటుల నిష్క్రమించునో
తెలియదు తెలియదు తెలియదు మనకు తెలియదు //ఈ జీవిత//
ఎవరికి వారే ఒంటరిగా బ్రతుకలేరని ఎంచియు
రుణాను బంధములను పెంచి
సంబంధములకు స్పందించి
ఒకరినొకరుగా తొడు నీడగా బ్రతుకులు లాగగ
ప్రారబ్దమును అనుసరించు నడుచుచున్నా ఈ నాటక మందునా //ఈ జీవిత//
జరిగెడి దానిని అనుభావించుచు
జరగబోవునది ఊహించుచు
తాను చేసినది విస్మరించుచు
పరులు చేసినది చూపించుచు
మంచికి తానే కారణమనుచు
చెడుకి ఇతరులు కారకులగుచును
కీచులాటలతో పెనుగులాటలతో
బ్రతుకును బరువుగా లాగు చుండెడి //ఈ జీవిత//
సత్యమేమిటో తెలిసినగాని
సంతసమన్నది అర్ధం కాదు
ఆశలు ధ్యాసలు అవేశములు
అర్ధరహితములనుచు తెలియదు
త్రికరణ శుద్దితో సత్యాన్వేషణ
మార్గాములో మునిగిన కానీ
బాధలు తొలగవు బంధములుడవు
జగదీశ్వరుడు గోచరించడు //ఈ జీవిత//
సత్సంగములో ఉండినగాని
సత్పురుషుల సేవించినగాని
సత్ గ్రంధాలములు చదివినగాని
సదాచరణతో ఉండినగాని
సత్యము తెలియదు సంతసముండదు
సదాలోచనలు అసలే కలుగావు
సత్యమునెరిగి చేసేడి సద్గురు
శ్యామ సాయిని సమాశ్రయింపుమా //ఈ జీవిత//

Comments
Post a Comment