13 January (13.01.) (13)
శ్రీ శారద శ్యామ సందేశం:
మహాత్ముల దగ్గర మన
ఇష్టాయిష్టాలు వదిలిపెట్టాలి. అన్ని నీవే అని పడి ఉండాలి. ఏ భావమూ లేకుండా
గురువు దగ్గరకు వెళ్తే ప్రశ్నించకుండానే అన్ని సమాధానాలు వస్తాయి.అప్పుడు
అవి గ్రహించే శక్తి ఉండాలి. ధ్యానము, పూజ చేస్తే ఆ సమాధానం గ్రహించే శక్తి
వస్తుంది.
We must leave our likes and dislikes
near sages. Everything is there, stay there. Without any feeling if you
go to the Guru without questioning, all the answers will come. You need
comprehension power to understand. If you meditate and worship, you will
get the power to comprehend that answer. (13 Jan)
13) నిను నమ్మితిరా
నిను నమ్మితిరా నీరజ నయనా
కరుణించుమా కమలలోచనా
ప్రగాఢమగు విశ్వాసము నోర్పుల గలిగిన వారిని రక్షింతువనీ
నీవే దిక్కని నమ్మిన వారల బాధ్యతల నెల్ల భరియింతువనీ
పూర్వ జన్మ సంసాదితమౌ ఈ పాప ఫలితముల వలలో జిక్కితి
పాప ఫలితములు తొలగింతువనీ జ్ఞాన వైరాగ్యంబుల నొసగెదవనీ
ముక్తి మార్గమున నడపింతువనీ సమర్థ సద్గురు దైవము నీవని
ఆర్తితో బిలచిన ఆదుకొందువని ఆవేదనలను తొలగింతువనీ
కోరిన కోర్కెల దీర్చుచుందువని కొంగు బంగారపు పెన్నిధి నీవని
దలచిన వారికి కనిపింతువనీ, బిలచిన వారితో పలుకు చుందువని ||నిను॥
Comments
Post a Comment