29 January (29.01.) (29)

 శ్రీ శారద శ్యామ సందేశం:

ఆలోచనారహితమయిన స్థితిగలిగినపుడే శాంతి, విశ్రాంతి. గురువును ఆశ్రయించి, విశ్వసించి, ఆయన చెప్పిన దానిని విజ్ఞతతో చేస్తూ, చేయడం కర్తవ్యంగా భావిస్తూ, గురువును శంకించకుండా 12 సంవత్సరములు పడిఉంటే ఆ స్థితి వస్తుంది.

Peace and Relaxation is in the state of thoughtlessness. Rely on the Guru, trusts him, wisely do what he says, feels it is your duty to do so. 12 years without doubting , believe Guru, you will be in that state. (29 Jan)



29) ఆగింరపుమా

ఆగింరపుమా ! ఫలము లారగింపుమా !

పరమాత్మా సాయీశ్వర, పరమ కృపాసాగర || ఆరగింపుమా ||


సర్వము నీదే యైన నూ,

నాది యనెడి అహము తోడ

నైవేద్యం బిడు చుంటిని

నవ్వకుమా నాగసాయి ||ఆరగింపుమా ||


విశ్వమెల్ల నిండి యున్న

నీ విటనే ఉన్నావని

అజ్ఞానముతో దలచుచు

కుడము నారగింపవేడితి ||ఆరగింపుమా||


మాయాతీతుడవైనను

మాయకు లోబడి నిన్నొక

మహాత్మునిగా భావించి

నివేదనల చేయుచు నుంటి || ఆరగింపుమా||


రూపాతీతుడవైనను

నిన్నొకరూపమున దలచి

అవివేకముతో నలుగుచు

ఆహారములను దెచ్చితి || ఆరగింపుమా ||


మాయకు లోబడి యుంటినో,

అమాయకునిగనుంటినో

ఎటు దలచిన నీవెగాదె

నైవేద్యము గ్రహియింపుమా || ఆరగింపుమా ||


నైవేద్యము లారగించి

నా సేవల ప్రేమగగోని,

అందించెడి చిలుము త్రాగి

ఆనందించుము దేవా, ఆదరించుమా మమ్మాదరించుమా

అనవరతము శ్యామదుల కనుగ్రహము నీయుమా || ఆరగింపుమా ||





Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)