26 January (26.01.) (26)

 శ్రీ శారద శ్యామ సందేశం:

ఓర్పు రావాలి అంటే తనకు ఇష్టమైన దైవమును/గురువును విశ్వసించి జరిగేదంతయూ దాని సంకల్పమేనని అది మన మేలునకేనని, ప్రతి విషయములోని మంచిని గ్రహించడానికి తీవ్రముగా ప్రయత్నించి, మంచిని గ్రహించగలిగే వివేకమును సంపాదించుకొనుట వలన భగవత్తత్వము/ గురుతత్త్వము యొక్క శక్తిని గుర్తించుటకు వీలు అగును.

Patience need to comes from believing in one's favorite God/Guru, and everything that happens is with their Will for our Welfare. Acquiring wisdom to perceive the good in everything, Can discern the Concent of God/Guru philosophy. (26 Jan)


26) ఇది నీ లీల కరుణా లోలా

ఇది నీ లీల కరుణా లోలా

శ్రితజనపాల షిరిడి వాలా ॥ఇది॥


లోకమున గల బాధల వేల

నాకము నరకము మాటల వేల

ఇహపర సుఖముల యోచన లేల

నీ పదములను నమ్మిన వేళ ॥ఇది॥


బరువు బాధ్యతల చింతన లేల

పాప పుణ్యముల పలుకుల వేల

తీర్థయాత్రులలో తిరుగుట దేల

నీ చరణములను నమ్మిన వేళ ॥ఇది||


గురువుల కొరకు వెదుకగనేల

ఉపదేశంబుల కోరుటదేల

నిష్ఠ సబూరుల వదలని వేళ

శ్యామసాయి దయ కలిగిన వేళ ॥ ఇది॥



Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)