23 January (23.01.) (23)

శ్రీ శారద శ్యామ సందేశం:

ప్రేమ, సేవ, క్షమ గుణములతో ప్రపంచమును జయించగలరు. క్రోధము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, అసంతృప్తులతో తమ మనుషులను/మనసులను కూడా జయించలేరు. కదా, కాదా?
Can conquer the world with the qualities of love, service and forgiveness. Can't even conquer their own people / minds with anger, jealousy, envy, hatred, dissatisfaction. Yes! Isn't? (23 Jan)


23) అర్ధించుచుంటినని

అర్ధించుచుంటినని అందలము

పైకెక్కి అవహేళనల పాల జేయకయ్యా


ప్రార్థించు చుంటినని పరిహాసమాడుచూ

పది మందిలో కించ బరచకయ్యా

దేవా...సాయిదేవా రావా నన్ను కావరావా ||అ||


కోర్కెలధికములనుచు కోపమ్ము జెందితివా

ఆశలధికములనుచు ఆయాస పడితివా

కోర్కెలు ఆశలు నీ అధీనములే గదా!

నేర్పుగా నడిపించి నీ దరికి జేర్చమని ||అ||


కాముకుడు వీడనుచు కరుణ మానితివా

మోహ మత్యధికమని మూగబోయితివా.

కామ మోహమ్ములు నీ సంకల్పమేగదా.

సద్భుద్ధులొసగి నీ కరుణ ప్రసరింపమని ||అ||


బలహీనతల వలలోన బందీగ మారాను..

అస్తవ్యస్తపు మార్గముల నడచుచున్నాను.

సర్వభారంబులను నీ పరము జేశాను.

శ్యామ సన్నుత సాయి కావరావే యనుచు ||అ||

Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)