10 January (10.01.) (10)

  శ్రీ శారద శ్యామ సందేశం :

అపారమైన, అనంతమైన ఆనందాన్ని పొందుటకు ప్రకృతిని పరిశీలించుట, పరిశీలనల నుండి పాఠములు నేర్చుకొనుట, వాటిని అనుభవమునకు తెచ్చకొనుటయే మార్గములు.

Observing nature, learning lessons from observations, and bringing them to experience are ways to gain enormous, infinite happiness. (10 Jan)


10) నీ కొరకై నిను

నీ కొరకై నిను ప్రేమింప నీయుమా

ప్రేమ ప్రదాత సాయి తండ్రి

అజ్ఞానమును ధ్వంసము చేయుమా

పతిత పావనా సాయి తండ్రి

పతిత పావనా శ్యామచరణా

పతిత పావనా వందిత చరణా


శ్రీ గురు నామమే భయమును బాపును

శ్రీ గురు సేవయే ముక్తి నొసగును

శ్రీ గురు కృపయే మన జీవితమూ

గురు సూక్తుల ఆచరణయే శ్రేష్ఠము


సద్గురు నామమే భవతారకమూ

సద్గురు స్మరణయే భయ నాశకము

శ్రీ గురు దేవా అని స్మరియించిన

నాలో నిలచి నను నడిపించును


తల్లి తండ్రి గురు దైవము తానై

శాంతి సౌఖ్యముల నాకందించును

శ్రీ గురు దేవా అని పిలిచినచో

పరుగు పరుగున నాదరి చేరును


బాధ్యతలన్నియు తానే భరించును

తన మార్గములో నను నడిపించును

నిను నమ్మినచో భయము నాకేల

సమర్థ సద్గురు సాయి దేవా


నిను భక్తితో సదా స్మరించగా

కృప చూపుము నా సాయి దేవా


పంచేంద్రియములు పంచప్రాణములు

అహంకారము మనసు బుద్దులను

నీ సేవలకై వినియోగింపగ

కృప జూపుము నా సాయి దేవా


నీ కొఱకై నిను ప్రేమింప నీయుము

నీ కొఱకై నను జీవింప నీయుము

నీ సేవలనే చేయ నీయుము

నీ కృపతో మము నడువ నీయుము


కరుణా భరణా కల్మష హరణా

ప్రేమ ప్రదాయక కల్మష నాశక

నిస్వార్ధముగా నడువ నీయుమా

శ్యామ పోషక శాంతి నొసగుమా


పతిత పావన శ్యామ చరణా

పతిత పవనా వందిత చరణా





Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)