6 January (06.01.) (06)
శ్రీ శారద శ్యామ సందేశం: 6 Jan
భగవంతుడు/గురువు గురించి భావన ఇలా ఉండాలి. మీ నామము ఎప్పుడూ పలుకుతూ ఉండనీవు తండ్రి. నాకు తమోగుణము రాకుండా చేయి తండ్రి. అందరిలో మీరు ఉన్నారు అనే భావన దృఢముగా కలిగించు తండ్రి.
This is how the perception towards God/Guru should be. Divine Father, may your name always be Chanted. Father, please help me not to get Tamogun (Darkness). Father strengthens the sense that you are in everyone.
6) శ్రవణము లోపమా
శ్రవణము లోపమా, స్మరణము లోపమా,
మననము లోపమా సాయి
శ్రవణ స్మరణ మన నాదులకందవు
శ్రవణ స్మరణ మన నాదులకందవు
ఇదేమి చిత్రమో సాయి సాయి //శ్రవణము//
పరాయణత్వముతో చేయని
పరాయణత్వముతో చేయని
పారాయణము లోపమా
ధ్యేయము నందలి ధ్యాస లేకయే
ధ్యేయము నందలి ధ్యాస లేకయే
ధ్యానము చేయుట లోపమా
అవగాహనయే లేక యాంత్రికపు
పూజలు చేయుట లోపమా
అహమును వదలక అటునిటు చూచుచు
ఆర్చించుటయే లోపమా
సదా చరణయే సతతము లేకయే
అతిగా వాగుట లోపమా
సకల జీవులలో నిన్ను చూడకయే
నీవు గలవనుట లోపమా
నిన్ను గూర్చి నేనేమి ఎరుగయే
పరులను దూరుట లోపమా
శరణు శరణుమను
శ్యామ చరణనుని కరుణతో బ్రోవ భారమా!! //శ్రవణము//

Comments
Post a Comment