28 January (28.01.) (28)

 శ్రీ శారద శ్యామ సందేశం:

ఎవ్వరూ శాశ్వతంగా బాధపడరు. ప్రతివారూ అనాధలే, దైవ నివాసమే అందరి అనాధశరణాలయం. నిన్ను దరిజేర్చుకొమ్మని దైవాన్ని పట్టుకుని ప్రార్థించు.
No one will suffer forever. Everyone is an orphan, and God's abode is everyone's orphanage. Hold on to God and pray He will guide you. (28 Jan)


28) అపార కరుణాసాగరా

అపార కరుణాసాగరా - అనంత ప్రేమమందిరా,

సమర్ధ సద్గురు సచ్చిదానంద సాయినాధ మహరాజ ॥అపార॥


అభయప్రదాత, అనాధరక్షక, ఆశ్రిత పోషక, నమో నమో….

ఆపద్భాంధవ అనంత మహిమా లీలా వినోది నమో నమో…. ॥అపార॥


భవ భయనాశక భక్తి ముక్తి ప్రద భావాతీత నమో నమో….

బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపా బంధనాశక నమో నమో…. ॥అపార॥


ఆది మధ్యాంతరహిత పరాత్పర అది దేవ గురు నమో నమో….

అనంత సృష్టి స్థితి లయకారక అత్రీనందన నమో నమో…. ॥అపార॥


సత్య ధర్మ శాంతి ప్రేమ ప్రదాతా సచ్చిదానంద నమో నమో….

సజ్జన సన్నుత ముని జన వందిత మోహన రూపా నమో నమో…. ॥అపార॥


కామ క్రోధ మద మత్సర లోభ మోహనాశక నమో నమో…..

కాల స్వరూపా కాలాతీతా కర్మవినాశక నమో నమో…. ॥అపార॥


సంశయనాశక, సద్గురు నాయక సద్గతిదాయక నమో నమో….

సకల చరాచర వాసా పరేశా శ్యామేశా ప్రభు నమో నమో… ॥అపార॥



Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)