8 January (08.01.) (08)
శ్రీ శారద శ్యామ సందేశం: (8 Jan)
అదృష్టం దైవమే, దురదృష్టము దైవమే కావున ఆ ఎరుకతో కృతజ్ఞుడవై ఉండి ప్రశాంతతను పొందుము.
Luck is divine, and misfortune is also divine so with consciousness be thankful and get peace.
Luck is divine, and misfortune is also divine so with consciousness be thankful and get peace.
8) మధురం మధురం
మధురం మధురం మన సంబంధంజన్మజన్మల రుణానుబంధం
జన్మజన్మల విడివడిన బంధం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం //2//
విడదీసినను విడవలేనిది
కదిలించిన ను కదలలేనిది
తొలగించినను తొలగబోనిది
అమృతమయముగా నిలిచిపోయినది //మధురం//
మరవ దలచినను మరువనీయనిది
మాటల చేతల భాషల కందనిది
తను మన ధనముల మరువజేయునది
ఆనందామృత మందు నిలచునది //మధురం//
సంతస మోసగి రక్షించునది
సంతస మోసగి సంరక్షించునది
స్మరియించినచో కృప చూపునది అని
ఆత్మీయతతో అలరించునది //మధురం// //సాయిరాం//
మధురం మధురం సాయి సంబంధం
మధురం మధురం సద్గురు బంధం //సాయిరాం//

Comments
Post a Comment