11 January (11.01.) (11)

శ్రీ శారద శ్యామ సందేశం:
నీవు పరిశుద్ధంగా ఉండాలనుకుంటే మనో, వాక్కాయ కర్మలయందు నిర్మలంగా ఉండు. నీ అంతరాత్మ ప్రబోధాన్ని మాత్రమే అనుసరించు.
If you want to be pure, be serene in your mind, words and deeds. Only follow your conscience. (11 Jan)




11) నీ దయ గలిగిన

నీ దయ గలిగిన కాని దేముంది

ఇహ పరములలో సాయీ

నీ కృపగలిగిన రాని దేముంది

శ్యామాదులకు సాయీ ||నీ||


నీ లీలల కీర్తించిన గలుగును

అనంత ధైర్యము సాయీ

నీ నామము స్మరియించిన గలుగును

అమితానందము సాయీ ||నీ||


నిను పూజించిన నిశ్చలముగ

మది నీపై నిలుచును సాయీ

నిను సేవించిన నిశ్చయమౌ

మది నిష్ఠ సబూరులు సాయీ ||నీ||


నిను ఆరాధించిన నే తెలియును

అసలు తత్వము సాయీ

నిను ప్రేమించిననే దెలియును

పరమ సత్యము సాయీ ॥నీ॥


నిను నమ్మినచో కలుగును

భువిలో అష్టసిద్ధులు సాయీ

నిను శరణన్నచో ఆనందింతురు

అష్టభోగముల సాయీ ||నీ||


నమ్మిన వదలక శరణము నొసగుచు

కరుణింతువు గద సాయీ

నీ చరణములే శరణము శరణము

సంకట హరణా సాయి ||నీ||



Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)