21 January (21.01.) (21)
శ్రీ శారద శ్యామ సందేశం:
గాలి మేఘాలను కలుపుతుంది, అదే గాలి మళ్ళీ వాటిని చెదరగొడుతుంది. అదే విధంగా మనస్సు మనుష్యుల బంధానికీ, మోక్షానికీ కారణమవుతోంది.
The
wind connects the clouds, and the same wind scatters them again. In
the same way the heart is causing the bondage and salvation of human
beings. (21 Jan)
21) నీకున్న బలమెంత
నీకున్న బలమెంత బంధుబలగమెంత
చదువు సంధ్యల వెంత శ్యామా?
నీకున్న ధన ధాన్య భోగ భాగ్యము లెంత
సద్గురుని యందు నీ విశ్వాసమెంత
శ్యామా...... ఆ........ ఆ
అహము మోహము లందు వ్యామోహమెంత
కామ క్రోధములందు మమకారమెంత
మద మాత్సర్యములందు సహకారమెంత
నీకు సహకారమెంత ||నీకున్న||
దారా పుత్రాదులతో నీ ధర్మమెంత
ఆహారముల యందు ఆసక్తి ఎంత
సజ్జనులతో మెలుగు సద్భావ మెంత
సకల జీవుల యందు అనురాగమెంత ||నీకున్న||
నాది నాదని బలుకు నీదు తెలివెంత
నాది నీదని బల్కు నీదు మనసెంతా
ఆనందమందుటకు ఆచరణ ఎంత
అసలు నీవెంత నీ అధికారమెంత ||నీకున్న||
Comments
Post a Comment