19 January (19.01.) (19)

 శ్రీ శారద శ్యామ సందేశం:

మహాత్ముని వద్ద కానీ లేదా గురువు వద్ద కానీ తరచూ కొంత సమయం గడుపుచుండుట వల్ల నీ ఆధ్యాత్మిక పథం నీ అర్హతనుబట్టి ఉన్న తమౌతుంది.
Spending time oftenly with Mahatma or Guru that will enhance your spiritual path according to your merit. (19 Jan)


19) నాతో పంతమా

నాతో పంతమా నా పాలి దైవమా సాయీ ॥నాతో॥

సుంత యేని మది శాంతి నిలుపవు వింత వింతగా బాధించెదవు ॥నాతో॥


ఎంతగా నిను ప్రార్థించిననూ ఎంతగా నిను వేడుకొనిననూ

రవ్వంత యేని కరుణ జూపవు ఒక్క సమస్యను పరిష్కరించవు ॥నాతో॥


సర్వ భారముల నీ పరము జేసి సమస్యలను నీ భుజంబుల మోపి

మంచి చెడుగులకు కారణమీవని బలుకుచు భువిలో బ్రతుకుచుంటినని ॥నాతో॥


తామసముతో తడబడు నడుగులతో అలసటతో ఆడంబరములతో

అంతయూ నీదయయేయని బలుకుచు ఆడుచుంటినని అల్పుడ నేనని ॥నాతో॥


దండించిననూ దరి జేర్చిననూ పరీక్షించినను పరిరక్షించిన

నీవుగాక యింకెవరున్నారని ఆశ్రయింతురా శ్యామ సన్నుతా సాయి ॥నాతో॥



Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)