25 January (25.01.) (25)

 శ్రీ శారద శ్యామ సందేశం:

ఓర్పు, హృదయపూర్వక ప్రేమ, దైవిక లక్షణములు, మంచి ఆలోచనలు, దైవము/గురువు యందు నమ్మకము మరియు ఆత్మవిశ్వాసములతో మనము ప్రపంచమునే జయించవచ్చు. ఇవన్నీ లేనప్పుడు మనము ఏమీ సాధించలేము.
With patience, heartful love, divine qualities, good thoughts, faith and self-confidence in God/Teacher we can conquer the world. Without all this we can achieve nothing. (25 Jan)


25) ఆటలనాడుచు నుంటివి దేవ

ఆటలనాడుచు నుంటివి దేవ!

వేడుక జూచుచు మహానుభావా ॥ఆట॥


ఆటల నాడగ వేడుక జూడగ,

మేమెంతటివారము సాయిదేవా ॥ఆట॥


అహమున ముంచుచు నుంటివి దేవా

మోహము బెంచుచు నుంటివి దేవా

అహమున ముంచుచు మోహము బెంచుచు

ఐహిక చింతల నుంచుచు దేవా ॥ఆట॥


కామమ్ము ను కలిగించుచు దేవా

క్రోధమ్ము ను రెట్టించుచు దేవా

కామ క్రోధ కందకముల ద్రోయుచు,

కష్టములను కలిగించుచు దేవా ॥ఆట॥


మదమును లోలో పెంచుచు దేవా

మత్సరమును కలిగించుచు దేవా

మదమత్సరములలో బడ వైచుచు

మంచిని మరువగ జేయుచుదేవా ॥ఆట॥


స్వార్థంబును మదిబెంచుచు దేవా

లోభంబును కలిగించుచు దేవా

స్వా ర్థలోభముల మదిరగిలించుచు

మాయలలో బడద్రోయుచు దేవా ॥ఆట॥


సకలము నీదని నెంచుచు దేవా

సతతము నిన్నే దలచుచు దేవా

సకలము నీదని సతతము దలచుచు

నున్న శ్యామను గాచుచు దేవా ॥ఆట॥



Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)