Posts

Showing posts from May, 2022

31 May (31.05.) (152)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 31 May దైవమును శరణుజొచ్చి భక్తిని, వాంఛల రాహిత్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ జీవించడము మంచిది. దైవమే అన్ని ప్రసాదించును కదా! It is good to take refuge in God, pray to get devotion and desirelessness. God is the one who provides everything right!  152) శిరిడి పురమున నీ శరీరమును దర్శించితినో లేదో (31.05) శిరిడి పురమున నీ శరీరమును దర్శించితినో లేదో గడచిన జన్మలలో నీ సేవల జేసుకుంటినో లేదో నేడు నీదు చిత్తరువును జూచుచు వేడు కొనుట - వినరాదా - అంతటి భాగ్యము ఎన్నడు కలుగునో ఎన్నడు నీదరి జేరుదునో యని నేడు లోకులు పలుగాకుల వలె దూరగా బాధల వలలు సంకెలలు బిగించగ భవ భంధముల దిగ్భంధనమున కుములుచు నిను శరణాగతి వేడితి // శిరిడి // 2. తల్లివి నీవై లాలించెదవు తండ్రివి నీవై పోషించెదవు సద్గురు నీవై నడిపించెదవు దైవము నీవై దరి జేర్చెదవు // శిరిడీ // 3. నీ రూపమునే సందర్శించెడి నీ పలుకుల నే విని పులకించెడి నీ సేవలనే జేయ గలిగెడి భాగ్యము నీయుము శ్యామ సన్నుత // శిరిడీ//

30 May (30.05.) (151)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 30 May నీటి మీద అలిగి స్నానం చేయకుంటే మన దేహమునకే అనారోగ్యం కలుగును. అలాగే లోకేశ్వరుని మరియు లోకముమీద అలిగినచో మనకే నష్టములు కలుగును కదా! With angry on water if we do not take a bath, our body will get sick. Like that if we angry on God and World, for us only there will be losses.  151)  శ్రీ సాయి నామములకు నిత్య జయ మంగళం (30.05) శ్రీ సాయి నామములకు నిత్య జయ మంగళం ప్రభు శ్రీ సాయి రూపములకు నిత్య శుభ మంగళం 1. శ్యామా తాత్యాలు, దీక్షిత్ నరసింహ, దాసుగణులు కృష్ణా, భాగోజీ, రాధాకృష్ణ మాయిలు గొలిచే //శ్రీ సాయి// 2. పురందర, విట్టలు, సాధే, బడేబాబా, మహల్సాపతి, ఉపాసనీ, మేఘశ్యాములు, నానా, నార్కెలు గొలిచే //శ్రీ సాయి// 3. నిమోన్కర్, బూటీ, దేవు, హనుమ, సాంబ, పార్థసారథి, కేశవయ్య, భరద్వాజ, బాలాసాహెబు గోలిచే //శ్రీ సాయి// 4. తారాబాయి, చంద్రా బాయి, మెహర్ బాబా, కృష్ణా భాయి, ఉమాబాయి , ద్వారకామాయి వరమ్మ, కళ్యాణి గొలిచే //శ్రీ సాయి// 5. భక్తిగ దైవమునే నమ్మి భజనలతో కీర్తించుచూ సద్గురు దేవుని సత్ కృప గోరుచు శ్యామదేవుడు సతతము తలచే //శ్రీ సాయి//

29 May (29.05.) (150)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 29 May ఆహార, భయ, నిద్ర అన్ని జీవులకు సమానము. మానవులు బుద్ధిజీవులు. బుద్ధిని ఉపయోగించి సత్య-ధర్మములకు అనుగుణముగా జీవించి తరించాలి. Food, fear, and sleep are the same for all living beings. Humans are intellectuals. We have to use the mind to live in accordance with the truth righteousness. 150) శిరిడీ నుంచి వచ్చినావా సాయి రామయ్యా (29.05) శిరిడీ నుంచి వచ్చినావా సాయి రామయ్యా ప్రేమ జూపి చిత్రముగ ఇంటికి దయజేసి నావయ్యా //శిరిడీ// శిరిడీ క్షేత్రము చూడగలేదు శ్రీకర సాయిశా ద్వారక మాయిన అడుగిడ లేదు భయహర శిరిడీశా నీ సమాధిని తాకగ లేదు జయ హర జగదీశా నీ పాదుకలను సేవింప లేదు రఘువర పరమేశా //శిరిడీ // 2. ఎప్పుడు దలచిన అప్పుడే మమ్ము అలరింతువయ్యా ఎక్కడ దలిచిన అక్కడే మమ్ము రక్షింతువయ్యా నీ చిత్రములో విచిత్రములనే జూపింతువయ్యా నమ్మిన వారిని వదలక ఎప్పుడు ప్రేమింతువయ్యా //శిరిడీ// 3. నీ లీలలనూ తెలియగ లేని నీ పిల్లలమయ్యా నీ మహిమల గుర్తించగా లేని జనులము మేమయ్యా నీ చేతులకు అర్థము తెలియని ఆశ్రితులమయ్యా శ్యామ సన్నుతుడె దిక్కు మా కనుచు నమ్మి నారమయ్యా //శిరిడీ//

28 May (28.05.) (149)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 28 May తన మనసును ఎవరూ మోసం చేసుకోలేరు. లోకమును మోసం చేస్తే లోకేశ్వరుని స్పందన ఉండును కదా! ఎరుక కలిగి సంస్కారముగా ప్రవర్తించుటయే కర్తవ్యం. No one can deceive his mind. If the world is deceived, there will be a response from God (Lokeshwar)? It is the duty with consciousness to behave in a decent manner. 149) శిరిడీ వాసా... శ్రీ సాయీశా... (28.05) శిరిడీ వాసా... శ్రీ సాయీశా... నీ పదముల నెర నమ్మితి మయ్య మము దయ గనుమా పరమేశా //శిరిడి // 1. తల్లివి నీవై... తండ్రివి నీవై గురుడవు నీవై.... దైవము నీవై భక్త జనులను పరిరక్షించగ ద్వారకా మాయి యందు వెలసిన //శిరిడి// 2. రాముడ నీవై... కృష్ణుడనీవై ప్రేమ స్వరూపా... సత్య స్వరూపా శివుడవు నీవై.... భవుడవు నీవై సాధు స్వరూపా ---సత్య స్వరూపా సకల దేవతా రూపుడ నీవై శ్యామాదులనూ పరిపాలించెడి //శిరిడి//

27 May (27.05.) (148)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 27 May నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. భావము బాగుంటే బ్రతుకు భద్రముగా ఉంటుంది. మనసు మంచిదైతే శాంతి తప్పక ఉంటుంది. సూర్యుడు ఉంటే చీకటి ఉండదు. If the talk is good, the town is good. Good feeling is safe for life. If the mind is good there must be peace. If there is sun there will be no darkness. 148) శ్రీరామ జయరామ - జయ జయ రామా (27.05) శ్రీరామ జయరామ - జయ జయ రామా జయ జయ రామ - జయ రామ శ్రీరామా //శ్రీరామ // మనసున నిలిచి శ్రీరామా - మాయ తొలగించు శ్రీరామా భక్తిని పెంచుము శ్రీరామా -‌మా బాధల మా బాపుము శ్రీరామా //శ్రీరామ// దిగులు తొలగించు శ్రీరామా - దిక్కు నీవయ్య శ్రీరామా దారుల జూపుము శ్రీరామా - దయ జూపమయ్య శ్రీరామా // శ్రీరామ // కామితము దీర్చు శ్రీరామ - కరుణను చూపి శ్రీరామ శామసన్నుతా శ్రీరామ -సద్గతి నీయవే శ్రీరామ //శ్రీరామ //

26 May (26.05.) (147)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 26 May ఇతరుల నుండి సహాయమును ఉచితముగా పొందకు. నీకు చేతనైన సహాయము, దానములను భగవత్ అర్పణ బుద్ధితో ఇతరులకు చేయుటవలన చెడు నశించును. Do not seek help for free from others. As you make conscious help and donations to others with the mind of submitting to God, evil will perish.  147) మంగళం జయ మంగళం (26.05) మంగళం జయ మంగళం మంగళం శుభ మంగళం శ్రీ సాయినాధునకు శిరిడీ నివాసునకు //మంగళం // ప్రేమ స్వరూపునకు - పరమాత్మ రూపునకు //మంగళం// శివరామ కృష్ణునకు - మారుతి రంగనికి //మంగళం// దత్త గురునాథునకు - ధర్మావతారునకు //మంగళం// సాఫల్య దాతకు - సద్గతి ప్రదాతకు‌‌ //మంగళం// కాల నిర్ణేతకు - కైవల్య దాతకు //మంగళం// కులమత రహితునకు - శ్యామ దేవునకు //మంగళం// జగమేలు తండ్రికి - జయ చిద్విలాసునకు //మంగళం//

25 May (25.05.) (146)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 25 May కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గములందురు. ఇవి బహు ప్రమాదములను, నీచజన్మలను కలిగించును. ఎలాగైనా వీటిని విసర్జించవలయును. Lust, anger, greed, fascination, Ego, jealousy are called Six internal enemies. These can cause multiple accidents and worst births. These should be discarded anyway.  146) శరణము శరణము రామా సాయి (25.05) శరణము శరణము రామా సాయి నీ దివ్య చరణమే శరణము సాయి //శరణము// 1. మ్రొక్కెద మ్రొక్కెద రామా సాయి మోద మలర మము గావుము సాయి //శరణము// 2. వేడెద వేడెద రామా సాయి వేదనలను తొలగించుము సాయి //శరణము// 3. పూజించద పూజించద సాయి పుణ్యాత్ములలో కలుపవే సాయి //శరణము// 5. అర్చించెద అర్చించద సాయి అనవరతము నను బ్రోవుము సాయి //శరణము// 6. ధ్యానించద ధ్యానించెద సాయి దరైశన మొసగుము దత్త గురు సాయి //శరణము// 7. సేవించద సేవించెద సాయి సమాధి నిష్ట నోసంగుము సాయి //శరణము// 7. వినుతించెద వినుతించెద సాయి వినయ వివేకముల పెంచుము సాయి //శరణము// 8. విశ్వాసంబును పెంచుము సాయి నిష్ఠ సబూరుల బెంచుము సాయి //శరణము// 9. నుతియించెద నుతియించెద సాయి ...

24 May (24.05.) (145)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 24 May మనకేది మంచిదో దైవానికి తెలుసు. కోరికలు లేకుండా మనకు శ్రేయస్కరమైన దానిని అనుగ్రహించమని ఆర్తితో దైవాన్ని ప్రార్ధించి నిశ్చింతగా ఉండండి. God knows what is best for us. Without desires bless us with what is best for us. Relax by praying to God with intensity.  145) శరణు శరణు రఘురామా... (24.05) శరణు శరణు రఘురామా... సాయిరామా.. సాయి దత్త గురునామా సద్గురు ధామ... ప్రభో సాయి రామ //శరణు// 1. సాయీ.. సాయీ‌.... అని స్మరించిన చాలూ సకల పాపంబులే సమసి పోవూ... సాయి సద్గురు కరుణే... సదా తోడు నీడయై గాచి రక్షించి ప్రేమ మీర బ్రోచు గాదా... //శరణు// 2. సకల దైవ స్వరూపములు సాయియే సకల ప్రాణి స్వరూపములు సాయియే ఎవ్వరెటుల బిలచినా... ఎవ్వరెటుల గొలిచినా... తానే ఆలకించి సర్వము సమకూర్చు గాదా... //శరణు//

23 May (23.05.) (144)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 23 May తృప్తికి మించిన ఆనందము లేదు. అసంతృప్తికి మించిన దుఃఖము లేదు. ఆరోగ్యమునకు మించిన సంపద లేదు. అనారోగ్యమునకు మించిన దరిద్రము లేదు. There is no happiness beyond satisfaction. There is no sorrow beyond dissatisfaction. There is no wealth beyond health. There is no poverty beyond illness.  144) శ్రీ స్వామిని సేవించుటలో (23.05) శ్రీ స్వామిని సేవించుటలో శ్రీనాధుని భజియించుటలో కలుగులే ఆనందము తొలగులే మన పాపము //శ్రీ స్వామి // 1. రామకృష్ణుల రమ్య స్వరూపం శ్యామ సుందర విగ్రహ రూపం కరుణ మమతలు కలిసిన రూపం మన కనుల కగపడు సద్గురు రూపం // శ్రీ స్వామి // 2 .మన ఆత్మల కోసగును అనంతశక్తి మనసుల పెంచును మరింత భక్తి ముసలెడి తీరుల తెలుపును యుక్తి చివరకు కూర్చును మన కిల ముక్తి ఈ మాయల నుండి విముక్తి --- //శ్రీ స్వామి//

22 May (22.05.) (143)

Image
శ్రీ శారద శ్యామ సందేశం: 22 May శరీరము, ఇంద్రియములు, ప్రాణము, సంపదలు, స్వజనులు, బంధువులు, ఆత్మ, భార్య, భర్త మొదలగునవి. అన్నీ సద్గురు సేవకై ఉపయోగించవలయును. Body, senses, life, wealth, kinsmen, relatives, soul, wife, husband, etc.  All should be used to service for Guru. 143) వలదు - వలదు సాయీ ! (22.05) వలదు - వలదు సాయీ ! నను వదల వలదు సాయీ ! నను వదిలిన నాశనమై నరకములో బడి పోవుదు _ //వలదు // 1. ధర్మమే దహనమై నీతియె నిర్మూలనమై న్యాయమే నశియించు చున్న స్థితి గతులలో నన్నుంచ //వలదు // 2. ప్రేమయే నశియించు చున్న ద్వేషమే పెరుగుచున్న స్వార్థము సంసారమున్న మనసులతో నన్నుంచ //వలదు// 3 .ఆడంబర మధికమైన ఆలోచన తక్కువైన ఆచరణయే శూన్యమైన మనుషులలో నన్నుంచ //వలదు// 4. నయవంచనతో నిండిన దయా రహితమౌ బ్రతుకుల ఢంభముతో గడుపుచున్న సంఘములో నన్నుంచ //వలదు// 5. అజ్ఞానం అధికమై నిను వదిలిన నను వదలక నను వదిలిన నిను వదలను మన మధ్యన భేదముంచ //వలదు// 6. దెలిసి దెలియక గడచిన జన్మలలో జేసినట్టి కర్మములకు ప్రతి ఫలముగ ఈ జన్మము కలిగేనేమో అటులికపై జేయించక జన్మములను కలిగించక గావ వేడెద శ్యామ చరణేశ్వరా -దేవా //వలదు//

21 May (21.05.) (142)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 21 May బాధలో ఉన్న వారి కుటుంబాలకు సానుభూతి చూపించుటకు బదులు మనకు తోచిన సహాయము చేసి, వారిని కాపాడమని దైవమును వేడుకొనవచ్చును కదా! Instead of showing sympathy to bereaved families, We can ask God to help us to save them? 142) వలదయ్యా - నను వదలకు మయ్యా (21.05) వలదయ్యా - నను వదలకు మయ్యా పాపాత్ముడనని నాపై కోపము //వలదయ్యా // 1. పవిత్రతయు యిసుమంతయు లేదని పరమ భక్తి నలుసంతయు లేదని సదాలోచనలు సుంతయు లేవని సదా చరణ శూన్యంమని - అలుక //వలదయ్యా // 2. దురాచారుడని దుర్మార్గుడనని సాధు పోషణలు సేవలు లేవని సమయాను కూలముగ నుండునని స్వార్థ పరాయణుడని - అలుక //వలదయ్యా // 3. ధర్మ న్యాయముల దలచు ననుచుననీ నీతి నియమముల పాటించనని సత్య మార్గమున సంచరించని సజ్జన దూషణ జేయుదుననీ - అలుక //వలదయ్య // 4. సద్గురువులను సరకు జేయనని సత్సంగముల పాల్గొనననీ సద్భక్తుల సహవాసము లేదని సద్భాషణలను జేయనని - అలుక //వలదయ్య // 5. పూర్వ పుణ్యమున నిన్ను దలచితిని రక్షించెదని మది నమ్మితిని నీ దరికి లాగ నిను శరణంటిని శ్యామదేవుని కరుణించ మంటినని - అలుక //వలదయ్య//

20 May (20.05.) (141)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: గాలిని తీసుకుని వదలడం జరిగినంత సహజముగా నీకు ఎవరితో లేక దేనితో సంబంధం ఉంటే అది ఆత్మానుబంధం. ఇంద్రియాతీతమగు శ్రీగురు బంధము ఆత్మా నుబంధం. ఎవరితోనైనా, దేనితోనైనా ఇంద్రియాతీతమగు బంధం ఉంటే అదే దైవమనే భావనతో, పవిత్రముగా కలకాలము కాపాడుకొనుటయే మన కర్తవ్యం. If you have a relationship with someone or something that is as natural (easy) as taking the breath, it is soul-intimacy. The transcendental bond with Guru is the soul-bond. If there is a transcendental bond with anyone or anything, feel that is God, and It is our duty to keep that sacred for eternity. 141) వ్యర్థపు యోచన లెందుకు మనసా (20.05) వ్యర్థపు యోచన లెందుకు మనసా వ్యామోహంబులు ఎందుకె మనసా నిరతము చింతన చేయుచు నుందువు జనన మరణ చక్రంబున నుందువు //వ్యర్థపు// 1. పంచ భూత సమ్మేళ మగునది దేహంబని నీ వెరుగుదువే పుట్టుట గిట్టుట లన్ని జీవులకు సహజంబని నీ వెరుగుదువే అశాశ్వతంబౌ ఆస్తి సంపదలు మోహమయంబని దెలియుదువే దెలిసి దెలిసియు దెలివి లేక పెడ మార్గములందున దిరిగేదవే //వ్యర్ధపు// 2. ఆశయే సర్వ దుఃఖంబులకు మూలం...

19 May (19.05.) (140)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 19 May డబ్బులు లెక్కపెట్టుకొనేటప్పుడు మాట్లాడతామా? లేదు. అన్ని పనులు పక్కన పెట్టి కేవలం డబ్బులు ఎంచుకోవడంలో నిమగ్నమవుతాం. అదే విధంగా భగవన్నామస్మరణ చేయాలి. Do we talk while counting money? Nope. Putting all the work aside and we just engage in money counting. The God Chant should be commemorated in the same way.  140) వందనములను గొనుమా (19.05) వందనములను గొనుమా వాయునందన హనుమా 1. శరణు శరణంటి హనుమా సద్భక్తి నొసగవే హనుమా వినుతించెద జయ హనుమా వీడక బ్రోవుము హనుమా //వందనము// 2. అభ్యర్థించెద హనుమా నన్ను ఆదరించవే హనుమా అర్ర్చించెద జయ హనుమా ఆశీస్సుల నొసగవే హనుమా 3. సన్నుతి జేసెద జయ హనుమా సద్గతుల నోసగవే హనుమా సతతము దలచెద హనుమా శ్యామాదుల గావవే హనుమా //వందనము//

18 May (18.05.) (139)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 18 May నువ్వు పైకి ఎదగడానికి 7 ముఖ్య విషయాలు:  1. నీకు ఉన్నదాంట్లో ఇతరులకు చిరు సహాయము. 2. ఓటమిలో కుంగిపోకుండా ప్రయత్నం.  3. పేదరికంలోనూ నిజాయితీ. 4. మాట తీరులో సరళత్వం.  5. కోపంలో కూడా సహనం. 6. కష్టాలను తట్టుకునే శక్తి.  7. ప్రతి మనిషిని గౌరవించడము. 7. Respect for every human being.  1. Little help to others in what you have.  2. Try not to succumb in defeat.  3. Be honest even in poverty.  4. Simplicity in wording.  5. Patience even in anger.  6. Strength to endure hardship.  7. Respecting everyone.  139) మోహనమే సాయి నామం (18.05) మోహనమే సాయి నామం సమ్మోహనమే సాయి రూపం 1. సకల వ్యాధులకు దివ్య ఔషధము సమస్యలకు అది పరిష్కారము సచిన్తనలకు ఆలంబనము సన్మార్గంబున కది ఆధారము //మోహనమే// 2. భక్తి జ్ఞానముల కదియే మూలము వైరాగ్యమునకు తరుణోపాయము శాంతి సుఖములకు అది సాధనము సద్గతు లందుట కదియే మార్గము //మోహనమే// 3. కలియుగమున కది కర్మనాశకము సత్పురుషుల కది సోహం నాదము సకల జీవులకు శాంతి దాయకము శ్యామాదులకు ముక...

17 May (17.05.) (138)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 17 May నువ్వు ఏమి చేసినా సంపూర్ణంగా, క్షుణ్ణంగా చెయ్యి లేదా చేయటానికి ఒప్పుకోకు. Whatever you do, do it wholeheartedly, thoroughly or don't agree to do. 138) బాబా నిను నమ్మిన బాధలు కలుగునా ? (17.05) బాబా నిను నమ్మిన బాధలు కలుగునా ? సాయీ నిన్ను నమ్మిన శోకము నిలుచునా ? త్రికరణ శుద్ధిగ భక్తిగ నిన్ను పిలువక యుండిన పలికెదవా శ్రద్ధతోడ నీ సేవలు చేయక ఆరాధించిన నిలిచెదవా //బాబా// 1. భక్తి శ్రద్ధ విశ్వాసము లుండక ఎంతగ నిను పిలచినను పలికెదవా కనిపించెదవా దయ చూచెదవా- కరుణించెదవా //బాబా// 2. భక్తిగ పిలచిన పలికెద నంటివి శ్రద్ధగ పిలిచిన నిలిచెద నంటివి భక్తిశ్రద్ధలు లేని మూర్ఖుడను నిన్ను ఎప్పుడు చూచెదనో ఎటుల తరియింతునో //బాబా// 3. భక్తి శ్రద్ధలను ఒసగి గావుము నిష్ట సబూరుల నొసగి బ్రోవుము ప్రేమ భావమును పెంపొందించుము దర్శనం మోసగి పలకరించుము //బాబా // 4. సర్వాభీష్ట ప్రదాయక సాయీ సచ్చిదానంద సద్గురు సాయీ సర్వమత సమ్మత శ్రీ సాయీ శ్యామృదయాధివాసా సాయీ //బాబా//

16 May (16.05.) (138)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 16 May మనుషుల వెంట ఎంత పడితే వారు అంత దూరము అవుతారు. భగవంతుని వెంట ఎంత పడితే భగవంతుడు అంత దగ్గర అవుతాడు. The more you follow people, they go that far. The more you follow God, God gets that much closer. 137) భేద భావము తొలగ జేయుము (16.05) భేద భావము తొలగ జేయుము బ్రహ్మానందము కలుగ జేయుము భావమందున గాన మందున నిలచి మమ్ముల నుద్దరింపుము బాబా సాయి నా బాబా సాయి //భేద// 1. సత్యమేదోతెలియజేయుము నిత్యమందున నిలిపివేయుము భక్తి యను భత్యమును వేయుము ముక్తి పదమును వాస వేయుము //భేద// 2. అణువు అణువున నీవు గలవను అనుభవముల కలుగ జేయుము ఆత్మ జ్ఞానము పొంద గలిగెడి మార్గ మందున నడువ జేయుము //భేద// 3. సుఖము దుఃఖము లనెడి భావన ఎన్నడైనను కలుగ జేయకుము సుఖము దుఃఖములనెడి భావనలన్నీ దాటెడి స్థితికి చేర్చుము సచ్చిదానందంబు నందున శ్యామచరణుని ముంచి వేయుము //భేద//

15 May (15.05.) (135)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 15 May ఏ పని చేసినా "అవసరమా? అనవసరమా?" అని ప్రశ్నించుకుని చేయాలి. (మాట్లాడేటప్పుడు అయినాసరే, ఏదైనా కొనేటప్పుడు అయినాసరే) What ever work we do that should be questioned "Is it necessary?, Is it unnecessary? (Even when talking, when buying anything).  136) బాబా నిను నమ్ముకుంటి (15.05) బాబా నిను నమ్ముకుంటి నీకే మ్రొక్కుచు నుంటి ప్రేమ గాచెదవన నీవే నా శరణ మంటి బాబా శ్రీ సాయి బాబా //బాబా// 1. సత్యమునే బలుక కుంటి- ధర్మమున నడవకుంటి దానముల చేయకుంటి - ఎందుకో నేనిట్లుంటి //బాబా// 2. సచ్చింతన చేయకుంటి - సన్మార్గము నడవకుంటి సత్సంగము చేయకుంటి - ఎందుకో నేనిట్లుంటి //బాబా// 3. నీ లీలల చదవకుంటి - ధ్యానము చేయకుంటి భజనలో పాల్గొన కుంటి - ఎందుకో నేనిట్లుంటి //బాబా// 4. మోసంబుల చేయుచుంటి - మోహంబున తిరుగుచుంటి మహాత్ముల జూడకుంటి - ఎందుకో నేనిట్లుంటి //బాబా// 5. మనసును నిలపకుంటి- మమతలను విడవకుంటి మాయలను దాటుకుంటి- ఎందుకో నేనిట్లుంటి //బాబా// 6. తల్లివై లాలించు - తండ్రివై నను పోషించు గురుడవై నను నడిపించు - దైవం బై దరిజేర్పించు //బాబా// 7. పాపముల జేయనీకు...

14 May (14.05.) (135)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 14 May జీర్ణము కాని ఆహారము దేహానికి విషతుల్యమైనట్లు ఆనందాన్ని ప్రసాదించని ఆచరణ ప్రమాదకరము. Undigestive food is poisonous to the body, Like that practice that does not give happiness is also dangerous.  135) ప్రసన్న వదనా సాయీ (14.05) ప్రసన్న వదనా సాయీ - పతిత పావనా సాయీ పరమ కృపాకర - పాపనాశకర - పావన నామా - సాయీ సద్గురు దేవా పాహిమాం సాయినాధా రక్షమాం // ప్రసన్న// 1. నీకును నీ చిత్రమునకు భేదము లేదనుచు మాకు తెలిపితివి నీ చిత్రమునకు చేసిన సేవలు నీకే చెందుననుచు తెలిపితివి భక్తి శ్రద్ధ విశ్వాసములున్నవో, లేవో కానీ నీ సేవలు చేయుచుంటి గ్రహించెదవో, ఆగ్రహించెదవో నెరుగని అవివేకిగా నేనుంటిని మౌనముగా నుందువో లేక మాటాడెదవో నెరుగ లేనయ్యా సాయి // ప్రసన్న // 2. నిరతము నీ చరణముల దరి నే విడువక నివసించగ నెంచితి సాయి నామ స్మరణము తోడనే సతతము జీవించ దలచితిని //ప్రసన్న// 3. సాయి సేవకుల సద్భక్తులకు సేవలు జేయుచు సచ్చిదానంద మొంద నెంచి తిని కరుణ బరపి ఈ దీనుని మొరలను విని దయ చూపుము - దరికి జేర్చుము //ప్రసన్న//