3 May (03.05.) (124)

 శ్రీ శారాద శ్యామ సందేశం: 3 May

భగవంతుని నమ్ముకున్న వారికి కష్టాలు ఆనందంగా ఉంటాయి. మామూలు వారికి కష్టాలు కష్టాలుగా ఉంటాయి. నమ్మకం ముదిరితే విశ్వాసం అవుతుంది.
Those who believe in God are happy with hardships. For ordinary people the hardships are hardships. Faith becomes trust as it matures.


124) నీ పవిత్ర పద పద్మముల పైన

నీ పవిత్ర పద పద్మముల పైన
నా శిరము నుంచ దయ చూడుమయా

నీ దివ్య కరముతో ప్రేమగా నిమిరి
దీవించి కరుణించవయా //నీ పవిత్ర //

ఆశ్రిత పోషక అనాధ రక్షక
దీన బాంధవా పాహిమాం
భక్తవత్సల భవ భయ నాశక
బాబాసాయి రక్షమాం //నీ పవిత్ర//

1. సుభద్రమగు నీ ఒడిలో శిరముంచి
కౌగిలించుకొన నీయుమయా
అరిషడ్వర్గములను సంహరించి
వాత్సల్యంబున గావుమయా //నీ పవిత్ర//

2. సచ్చిదానంద మొసగు నీచరణ
కమలముల సేవ నొసగుమయా
సతతము నీ నామ రూపములు
మనసున నిలువగ బ్రోవుమయ్యా //నీ పవిత్ర//

3. సర్వాభీష్ట ప్రదాయకమౌ
నీ చరితమునే చదివించుమయా
సూనృత మగు నీ దివ్య లీలలను
గాన మొనరింప నీయుమయా //నీ పవిత్ర //

4. నీ సేవకులకు సేవలు జేసేడి
మహాత్భాగ్యము నొసగుమయా
సుమధుర మధురంబగు నీ పలుకుల
విని తరియింపగ జేయుమయా //నీ పవిత్ర//

5 . నిష్ట సబూరుల నా ఊపిరిగా
జేసి నన్ను గ్రహియింపుమయా
నీ దివ్య రూప సందర్శనమును
సర్వావస్థల నొసగుమయా //నీ పవిత్ర//

6. సుఖదుఃఖంబుల మంచి చెడుగులలో
నా మదిలోనే నిలుపు నిలుపుమయా
నీ దరికి జేరు మార్గంబుననే నిరతము
నన్ను నడుపు మయా //నీ పవిత్ర//

7. తెలిసీ తెలియక చేసిన దోస గుల
క్షమియించి దయను చూపుమయా
ప్రేమమయా నీలో నైక్య
మొనరించుమయా శ్యామహృదయా //నీ పవిత్ర//




Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)