28 May (28.05.) (149)

 శ్రీ శారద శ్యామ సందేశం: 28 May

తన మనసును ఎవరూ మోసం చేసుకోలేరు. లోకమును మోసం చేస్తే లోకేశ్వరుని స్పందన ఉండును కదా! ఎరుక కలిగి సంస్కారముగా ప్రవర్తించుటయే కర్తవ్యం.
No one can deceive his mind. If the world is deceived, there will be a response from God (Lokeshwar)? It is the duty with consciousness to behave in a decent manner.

149) శిరిడీ వాసా... శ్రీ సాయీశా... (28.05)

శిరిడీ వాసా... శ్రీ సాయీశా...
నీ పదముల నెర నమ్మితి మయ్య
మము దయ గనుమా పరమేశా //శిరిడి //

1. తల్లివి నీవై... తండ్రివి నీవై
గురుడవు నీవై.... దైవము నీవై
భక్త జనులను పరిరక్షించగ
ద్వారకా మాయి యందు వెలసిన //శిరిడి//

2. రాముడ నీవై... కృష్ణుడనీవై
ప్రేమ స్వరూపా... సత్య స్వరూపా
శివుడవు నీవై.... భవుడవు నీవై
సాధు స్వరూపా ---సత్య స్వరూపా
సకల దేవతా రూపుడ నీవై
శ్యామాదులనూ పరిపాలించెడి //శిరిడి//




Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)