18 May (18.05.) (139)
శ్రీ శారద శ్యామ సందేశం: 18 May
నువ్వు పైకి ఎదగడానికి 7 ముఖ్య విషయాలు:
1. నీకు ఉన్నదాంట్లో ఇతరులకు చిరు సహాయము.
2. ఓటమిలో కుంగిపోకుండా ప్రయత్నం.
3. పేదరికంలోనూ నిజాయితీ.
4. మాట తీరులో సరళత్వం.
5. కోపంలో కూడా సహనం.
6. కష్టాలను తట్టుకునే శక్తి.
7. ప్రతి మనిషిని గౌరవించడము.
7. Respect for every human being.
1. Little help to others in what you have.
2. Try not to succumb in defeat.
3. Be honest even in poverty.
4. Simplicity in wording.
5. Patience even in anger.
6. Strength to endure hardship.
7. Respecting everyone.
139) మోహనమే సాయి నామం (18.05)
మోహనమే సాయి నామం
సమ్మోహనమే సాయి రూపం
1. సకల వ్యాధులకు దివ్య ఔషధము
సమస్యలకు అది పరిష్కారము
సచిన్తనలకు ఆలంబనము
సన్మార్గంబున కది ఆధారము //మోహనమే//
2. భక్తి జ్ఞానముల కదియే మూలము
వైరాగ్యమునకు తరుణోపాయము
శాంతి సుఖములకు అది సాధనము
సద్గతు లందుట కదియే మార్గము //మోహనమే//
3. కలియుగమున కది కర్మనాశకము
సత్పురుషుల కది సోహం నాదము
సకల జీవులకు శాంతి దాయకము
శ్యామాదులకు ముక్తిదాయకము //మోహనమే//
Comments
Post a Comment