17 May (17.05.) (138)

 శ్రీ శారద శ్యామ సందేశం: 17 May

నువ్వు ఏమి చేసినా సంపూర్ణంగా, క్షుణ్ణంగా చెయ్యి లేదా చేయటానికి ఒప్పుకోకు.
Whatever you do, do it wholeheartedly, thoroughly or don't agree to do.


138) బాబా నిను నమ్మిన బాధలు కలుగునా ? (17.05)

బాబా నిను నమ్మిన బాధలు కలుగునా ?
సాయీ నిన్ను నమ్మిన శోకము నిలుచునా ?
త్రికరణ శుద్ధిగ భక్తిగ నిన్ను పిలువక యుండిన పలికెదవా
శ్రద్ధతోడ నీ సేవలు చేయక ఆరాధించిన నిలిచెదవా //బాబా//

1. భక్తి శ్రద్ధ విశ్వాసము లుండక
ఎంతగ నిను పిలచినను
పలికెదవా కనిపించెదవా
దయ చూచెదవా- కరుణించెదవా //బాబా//

2. భక్తిగ పిలచిన పలికెద నంటివి
శ్రద్ధగ పిలిచిన నిలిచెద నంటివి
భక్తిశ్రద్ధలు లేని మూర్ఖుడను
నిన్ను ఎప్పుడు చూచెదనో ఎటుల తరియింతునో //బాబా//

3. భక్తి శ్రద్ధలను ఒసగి గావుము
నిష్ట సబూరుల నొసగి బ్రోవుము
ప్రేమ భావమును పెంపొందించుము
దర్శనం మోసగి పలకరించుము //బాబా //

4. సర్వాభీష్ట ప్రదాయక సాయీ
సచ్చిదానంద సద్గురు సాయీ
సర్వమత సమ్మత శ్రీ సాయీ
శ్యామృదయాధివాసా సాయీ //బాబా//



Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)