29 May (29.05.) (150)

 శ్రీ శారద శ్యామ సందేశం: 29 May

ఆహార, భయ, నిద్ర అన్ని జీవులకు సమానము. మానవులు బుద్ధిజీవులు. బుద్ధిని ఉపయోగించి సత్య-ధర్మములకు అనుగుణముగా జీవించి తరించాలి.
Food, fear, and sleep are the same for all living beings. Humans are intellectuals. We have to use the mind to live in accordance with the truth righteousness.


150) శిరిడీ నుంచి వచ్చినావా సాయి రామయ్యా (29.05)

శిరిడీ నుంచి వచ్చినావా సాయి రామయ్యా
ప్రేమ జూపి చిత్రముగ ఇంటికి దయజేసి నావయ్యా //శిరిడీ//

శిరిడీ క్షేత్రము చూడగలేదు శ్రీకర సాయిశా
ద్వారక మాయిన అడుగిడ లేదు భయహర శిరిడీశా
నీ సమాధిని తాకగ లేదు జయ హర జగదీశా
నీ పాదుకలను సేవింప లేదు రఘువర పరమేశా //శిరిడీ //

2. ఎప్పుడు దలచిన అప్పుడే మమ్ము అలరింతువయ్యా
ఎక్కడ దలిచిన అక్కడే మమ్ము రక్షింతువయ్యా
నీ చిత్రములో విచిత్రములనే జూపింతువయ్యా
నమ్మిన వారిని వదలక ఎప్పుడు ప్రేమింతువయ్యా //శిరిడీ//

3. నీ లీలలనూ తెలియగ లేని నీ పిల్లలమయ్యా
నీ మహిమల గుర్తించగా లేని జనులము మేమయ్యా
నీ చేతులకు అర్థము తెలియని ఆశ్రితులమయ్యా
శ్యామ సన్నుతుడె దిక్కు మా కనుచు నమ్మి నారమయ్యా //శిరిడీ//



Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)