6 May (06.05.) (127)

శ్రీ శారాద శ్యామ సందేశం: 6 May

భక్తి - విశ్వాసము చాలా ముఖ్యము. ఇవి ఓర్పునిస్తాయి. ఓర్పు లేకపోతే విశ్వాసం సన్నగిల్లినట్లే కనుక భక్తి విశ్వాసములు విడువరాదు
Devotion - Faith is very important. These are the ones that gives patience. If there is no patience, faith will weaken, so devotion and faith should not be abandoned. 


127) నీ లీలల తెలియగ తరమే

నీ లీలల తెలియగ తరమే
నీ మహిమల పొగడగ వశమే
నిర్గుణ సగుణ సచ్చిదానంద
సద్గురు దేవా సాయీ //నీ లీలల//

1. అవాంగ్ మానస గోచరుడవు
ఆది మధ్యంత రహితుడవు
ఆదిదేవుడవు అధి దేవుడవు
అప్రమేయుడవు అపాంతరాత్ముడవు // నీ లీలల//

2. సంతతా నంద సంధాయకుడవు
సద్గురుడవు సర్వోన్నతుడవు
సంసార దుఃఖ వినాశకుడవు
సత్య రూపుడవు సత్య రూపుడవు //నీ లీలల//

3 . సద్భక్తుడవు సంరక్షకుడవు
సకల సంశయ విచ్చేధకుడవు
వివేక విజ్ఞాన ప్రదాయకుడవు
శ్యామ హృదయడవు శ్యామ నాథుడవు //నీ లీలల// 



Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)