14 May (14.05.) (135)

 శ్రీ శారాద శ్యామ సందేశం: 14 May

జీర్ణము కాని ఆహారము దేహానికి విషతుల్యమైనట్లు ఆనందాన్ని ప్రసాదించని ఆచరణ ప్రమాదకరము.
Undigestive food is poisonous to the body, Like that practice that does not give happiness is also dangerous. 


135) ప్రసన్న వదనా సాయీ (14.05)

ప్రసన్న వదనా సాయీ - పతిత పావనా సాయీ పరమ కృపాకర - పాపనాశకర -

పావన నామా - సాయీ సద్గురు దేవా

పాహిమాం సాయినాధా రక్షమాం // ప్రసన్న// 1. నీకును నీ చిత్రమునకు భేదము లేదనుచు మాకు తెలిపితివి నీ చిత్రమునకు చేసిన సేవలు నీకే చెందుననుచు తెలిపితివి భక్తి శ్రద్ధ విశ్వాసములున్నవో, లేవో కానీ

నీ సేవలు చేయుచుంటి గ్రహించెదవో,

ఆగ్రహించెదవో నెరుగని అవివేకిగా నేనుంటిని

మౌనముగా నుందువో లేక మాటాడెదవో

నెరుగ లేనయ్యా సాయి // ప్రసన్న //

2. నిరతము నీ చరణముల దరి నే విడువక నివసించగ నెంచితి సాయి నామ స్మరణము తోడనే సతతము జీవించ దలచితిని //ప్రసన్న// 3. సాయి సేవకుల సద్భక్తులకు సేవలు జేయుచు సచ్చిదానంద మొంద నెంచి తిని కరుణ బరపి ఈ దీనుని మొరలను విని దయ చూపుము - దరికి జేర్చుము //ప్రసన్న//





Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)