27 May (27.05.) (148)
శ్రీ శారద శ్యామ సందేశం: 27 May
నోరు మంచిదైతే ఊరు
మంచిదవుతుంది. భావము బాగుంటే బ్రతుకు భద్రముగా ఉంటుంది. మనసు మంచిదైతే
శాంతి తప్పక ఉంటుంది. సూర్యుడు ఉంటే చీకటి ఉండదు.
If
the talk is good, the town is good. Good feeling is safe for life. If
the mind is good there must be peace. If there is sun there will be no
darkness.
148) శ్రీరామ జయరామ - జయ జయ రామా (27.05)
శ్రీరామ జయరామ - జయ జయ రామా
జయ జయ రామ - జయ రామ శ్రీరామా //శ్రీరామ //
మనసున నిలిచి శ్రీరామా - మాయ తొలగించు శ్రీరామా
భక్తిని పెంచుము శ్రీరామా -మా బాధల మా బాపుము శ్రీరామా //శ్రీరామ//
దిగులు తొలగించు శ్రీరామా - దిక్కు నీవయ్య శ్రీరామా
దారుల జూపుము శ్రీరామా - దయ జూపమయ్య శ్రీరామా // శ్రీరామ //
కామితము దీర్చు శ్రీరామ - కరుణను చూపి శ్రీరామ
శామసన్నుతా శ్రీరామ -సద్గతి నీయవే శ్రీరామ //శ్రీరామ //
Comments
Post a Comment