22 May (22.05.) (143)

శ్రీ శారద శ్యామ సందేశం: 22 May
శరీరము, ఇంద్రియములు, ప్రాణము, సంపదలు, స్వజనులు, బంధువులు, ఆత్మ, భార్య, భర్త మొదలగునవి. అన్నీ సద్గురు సేవకై ఉపయోగించవలయును.
Body, senses, life, wealth, kinsmen, relatives, soul, wife, husband, etc.  All should be used to service for Guru.


143) వలదు - వలదు సాయీ ! (22.05)

వలదు - వలదు సాయీ !
నను వదల వలదు సాయీ !
నను వదిలిన నాశనమై
నరకములో బడి పోవుదు _ //వలదు //

1. ధర్మమే దహనమై
నీతియె నిర్మూలనమై
న్యాయమే నశియించు చున్న
స్థితి గతులలో నన్నుంచ //వలదు //

2. ప్రేమయే నశియించు చున్న
ద్వేషమే పెరుగుచున్న
స్వార్థము సంసారమున్న
మనసులతో నన్నుంచ //వలదు//

3 .ఆడంబర మధికమైన
ఆలోచన తక్కువైన
ఆచరణయే శూన్యమైన
మనుషులలో నన్నుంచ //వలదు//

4. నయవంచనతో నిండిన
దయా రహితమౌ బ్రతుకుల
ఢంభముతో గడుపుచున్న
సంఘములో నన్నుంచ //వలదు//

5. అజ్ఞానం అధికమై
నిను వదిలిన నను వదలక
నను వదిలిన నిను వదలను
మన మధ్యన భేదముంచ //వలదు//

6. దెలిసి దెలియక గడచిన జన్మలలో
జేసినట్టి కర్మములకు ప్రతి ఫలముగ
ఈ జన్మము కలిగేనేమో అటులికపై

జేయించక జన్మములను కలిగించక గావ వేడెద
శ్యామ చరణేశ్వరా -దేవా //వలదు//





Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)