31 May (31.05.) (152)

 శ్రీ శారద శ్యామ సందేశం: 31 May

దైవమును శరణుజొచ్చి భక్తిని, వాంఛల రాహిత్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ జీవించడము మంచిది. దైవమే అన్ని ప్రసాదించును కదా!
It is good to take refuge in God, pray to get devotion and desirelessness. God is the one who provides everything right! 

152) శిరిడి పురమున నీ శరీరమును దర్శించితినో లేదో (31.05)
శిరిడి పురమున నీ శరీరమును దర్శించితినో లేదో
గడచిన జన్మలలో నీ సేవల జేసుకుంటినో లేదో
నేడు నీదు చిత్తరువును జూచుచు వేడు కొనుట - వినరాదా -

అంతటి భాగ్యము ఎన్నడు కలుగునో
ఎన్నడు నీదరి జేరుదునో యని నేడు

లోకులు పలుగాకుల వలె దూరగా
బాధల వలలు సంకెలలు బిగించగ
భవ భంధముల దిగ్భంధనమున
కుములుచు నిను శరణాగతి వేడితి // శిరిడి //

2. తల్లివి నీవై లాలించెదవు
తండ్రివి నీవై పోషించెదవు
సద్గురు నీవై నడిపించెదవు
దైవము నీవై దరి జేర్చెదవు // శిరిడీ //

3. నీ రూపమునే సందర్శించెడి
నీ పలుకుల నే విని పులకించెడి
నీ సేవలనే జేయ గలిగెడి
భాగ్యము నీయుము శ్యామ సన్నుత // శిరిడీ//




Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)