23 May (23.05.) (144)
శ్రీ శారద శ్యామ సందేశం: 23 May
తృప్తికి మించిన ఆనందము లేదు. అసంతృప్తికి మించిన దుఃఖము లేదు. ఆరోగ్యమునకు మించిన సంపద లేదు. అనారోగ్యమునకు మించిన దరిద్రము లేదు.
There
is no happiness beyond satisfaction. There is no sorrow beyond
dissatisfaction. There is no wealth beyond health. There is no poverty
beyond illness.
144) శ్రీ స్వామిని సేవించుటలో (23.05)
శ్రీ స్వామిని సేవించుటలో
శ్రీనాధుని భజియించుటలో
కలుగులే ఆనందము
తొలగులే మన పాపము //శ్రీ స్వామి //
1. రామకృష్ణుల రమ్య స్వరూపం
శ్యామ సుందర విగ్రహ రూపం
కరుణ మమతలు కలిసిన రూపం
మన కనుల కగపడు సద్గురు రూపం // శ్రీ స్వామి //
2 .మన ఆత్మల కోసగును అనంతశక్తి
మనసుల పెంచును మరింత భక్తి
ముసలెడి తీరుల తెలుపును యుక్తి
చివరకు కూర్చును మన కిల ముక్తి
ఈ మాయల నుండి విముక్తి --- //శ్రీ స్వామి//
Comments
Post a Comment